ముఖ్యాంశాలు

  • ట్వీటర్ లో సీఎం జగన్ ను ప్రశ్నించిన లోకేష్
  • లక్షల మంది రైతుల్లో వందలమందే అర్హులా..?!
  • రైతులకు కూడా కులం రంగు వేస్తున్నారా అని ప్రశ్నించిన లోకేష్

అమరావతి:ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను ప్రశ్నిస్తూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. ‘కౌలు’ భరోసా దారుణమంటూ తన ట్విట్‌కు ఓ పేపర్ క్లిప్‌ను కూడా యాడ్ చేశారు. 17లక్షల కౌలు రైతులు ఉంటే ‘రైతు భరోసా’ ఇవ్వడానికి 905 మంది రైతులే కనిపించారా అంటూ ట్విట్ చేశారు. ప్రతి దానికి మీ పార్టీ రంగు వేసినట్లు, రైతులకూ కులం రంగు పులిమారా అంటూ వైఎస్ జగన్‌ను ప్రశ్నించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.