తెలంగాణ‌లో లాక్‌డౌన్ పొడిగింపు..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 April 2020 12:57 PM GMT
తెలంగాణ‌లో లాక్‌డౌన్ పొడిగింపు..?

క‌రోనా పాజిటివ్ కేసులు రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్ప‌టికే రాష్ట్రంలో 800 పైగా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. కాగా.. రాష్ట్రంలో తాజా ప‌రిస్థితుల‌పై ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న కేబినేట్ స‌మావేశం జ‌రుగుతోంది. ఇక కేంద్రం ఏప్రిల్ 20 నుంచి లాక్‌డౌన్‌ను కొంత మేర స‌డ‌లిస్తామ‌ని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్ స‌డ‌లించాలా..? లేక య‌ధా స్థితిని కొన‌సాగించాలా అనే అంశం పై ప్ర‌ధానంగా చ‌ర్చ‌జ‌రుగుతోంది.

రాష్ట్రంలో కేసులు సంఖ్య పెరుగుతుండ‌డంతో తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్ ను మే 7 వ‌ర‌కు పొడిగించాల‌ని సీఎం కేసీఆర్ బావిస్తున్న‌ట్లు స‌మాచారం. పుడ్ డెలీవ‌రీ స‌ర్వీసుల‌ను కూడా నిషేదించాల‌ని బావిస్తోంది.ఇక కిరాయిదారుల‌‌కు ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు.. ఇళ్ల య‌జ‌మానులు మూడు నెల‌ల పాటు అద్దెలు వ‌సూలు చేయ‌కుండా ఆదేశాలు ఇచ్చే అవ‌కాశం ఉంది. ఈ స‌మావేశం అనంత‌రం కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవ‌కాశం ఉంది.

Next Story