బ్రేకింగ్: తెలంగాణలో మే 29 వరకూ లాక్‌డౌన్ పొడిగింపు : సీఎం కేసీఆర్
By సుభాష్
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కాలరాస్తోంది. ఇక తెలంగాణలో మొదట్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోగా, గత ఐదారు రోజుల నుంచి తగ్గుముఖం పట్టాయి. ఇక కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణలో విధించిన లాక్‌డౌన్ ఈనెల 7వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో నిర్వహించిన మంత్రివర్గ ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. లాక్‌డౌన్ పొడిగింపు, మద్యం అమ్మకాలపై కీలక చర్చ జరిగింది. సుమారు ఏడు గంటల సుదీర్ఘంగా మంత్రివర్గ సమావేశం జరిగింది.
అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. మంగళవారం కొత్తగా11 మందికి కరోనా పాజిటివ్ రాగా, ఇప్పటి వరకు 1096 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఈ రోజు 43 మంది డిశ్చార్జ్ అయ్యారని, ఇప్పటి వరకూ 628 మంది డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. 439 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు వివరించారు. ఇప్పటి వరకూ 29 మంది మృతి చెందినట్లు చెప్పారు. ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో కరోనా వ్యాప్తి తక్కువగా ఉందన్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు 3.37, రాష్ట్రంలో 2.24 శాతం మాత్రమే ఉందన్నారు. కరోనా విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ముందు నుంచే పకడ్డందీగా ఉన్నామన్నారు.
29 వరకూ లాక్‌డౌన్
ఉంటే అలాగే మే 29వ తేదీ వరకూ లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. పూర్తి స్థాయిలో తగ్గిపోయే వరకూ లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు ప్రజలు కూడా సహకరించాలన్నారు. కరోనా పూర్తిగా తరిమికొట్టాలంటే లాక్‌డౌన్ విధించడం ఖచ్చితమని తెలిపారు.