లాక్‌డౌన్ వల్ల ఏం నేర్చుకున్నాం..!
By సుభాష్ Published on 3 Jun 2020 7:08 AM GMTకరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ దాదాపు 200లకుపైగా దేశాలకు విస్తరించింది. కరోనా మరణాలు, కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం తీవ్రంగా ఉంది. ఇక కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్ కొనసాగుతోంది. దేశంలో దాదాపు రెండు నెలలకు పైగా లాక్‌డౌన్ కొనసాగి కొద్ది కొద్దిగా సడలింపులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా ఇంట్లో ఉండి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కాని ఇంట్లో ఉండటం వల్ల జనాలు ఎన్నో నేర్పుకున్నారు. ఒకప్పుడు ఒక రోజు బస్సులు బంద్ ఉంటేనే తల్లిడిల్లిపోయేవారం. ఇప్పుడు ఏకంగా రెండు నెలల పాటు బస్సులు, ఇతర షాపులు, ఇతర రంగాలు అన్ని మూతపడ్డా కూడా మనం బతకగలిగామంటే జీవితంలో ఎన్నో నేర్చుకున్నామనే చెప్పాలి.
వర్క్ ఫ్రమ్ హోమ్‌వర్క్ ఫ్రమ్ హోమ్ ఒక స్వప్నం కాదని, ఇలాంటి కష్టతరమైన సమయంలో ఎంతో అవసరమని నేర్పించింది లాక్‌డౌన్. అంతేకాదు వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కాలుష్యం కూడా పూర్తిగా ఎంతో తగ్గిపోయింది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఒక స్వప్నం కాదని, సకంట సమయంలో ఎంతో అవసరమని లాక్‌డౌన్ ద్వారా నేర్చుకున్నాము. ఆఫీసులకు వెళ్లకుండానే ఇంటి నుంచే వర్క్ చేశాము. ఇలాంటి విపత్కర సమయంలో కార్యాలయాలకు వెళ్లకుండానే ఇంటి నుంచి ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చని నిరూపించుకున్నాము. |
ప్రభుత్వాలు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చుప్రభుత్వాలు తలుచుకుంటే నిమిషాల్లోనే పథకాలు రూపొందించి పేదలకు ఆదుకోవడం లాంటివి సాధ్యమని నిరూపితమైంది. పేదలకు తినడానికి తిండి లేకున్నా అప్పటికప్పుడు ఆహారాన్ని తయారు చేసి పేదలకు అందించడం సాధ్యమనది లాక్‌డౌన్ వల్ల నేర్చుకోవచ్చు. నిమిషాల్లోనే ఆహారం తయారు చేసుకోవడం, నిమిషాల్లోనే మాస్కులు, ఇతర వస్తువులు అందించడం సాధ్యమవుతుందని నేర్చుకున్నాము. |
లాక్‌డౌన్ వల్ల పొదుపుగా వాడుకోవడం నేర్చుకున్నాంలాక్డౌన్ సమయంలో పొదువు విలువ బాగా తెలిసొచ్చింది. కష్టకాలంలో డబ్బులను తెలివిగా ఎలా ఖర్చు పెట్టాలో లాక్‌డౌన్ వల్ల నేర్చుకున్నాము. లాక్‌డౌన్‌కు ముందు విచ్చలవిడిగా ఖర్చు చేసిన జనాలు లాక్‌డౌన్ వల్ల పొదుపుగా వాడుకోవడం నేర్చుకున్నారు. ఇలాంటి కష్టకాలంలో ఎలా ఎంత పొదుపుగా బతుకుతున్నామో అన్నది చాలా ముఖ్యం. ప్రతీవారం సినిమాలు చూడకపోయినా, షాపింగ్‌లు చేయకపోయినా రెస్టారెంట్లకు వెళ్లకపోయినా బతకగలమని లాక్‌డౌన్ నేర్పింది. |
భార్యాభర్తలను ఇంట్లో కూర్చోబెట్టిన లాక్డౌన్కాలంతో పోడిపడి పరుగెడుతున్న సమయంలో ఇంట్లో భార్యాభర్తలను కూర్చోబెట్టి కబుర్లు చెప్పుకునేలా చేసింది లాక్‌డౌన్. వాట్సాప్‌లలో తప్ప నేరుగా కలవకపోయినా కుటుంబ సభ్యులందరినీ సైతం ఒక్క చోట కలిపింది. ఏ క్షణంలో ఏం జరిగినా ధైర్యంగా ఎదుర్కొవాలన్న తత్వం లాక్‌డౌన్ నేర్పించింది. |
బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండగలమన్న నమ్మకం కలిగించిందికొందరు మద్యం ప్రియులు రోజు వారీగా మద్యం లేకుండా ఉండలేరు. అలాంటిది ఈ సమయంలో మద్యం లేకుండా ఉండగలను అనే ధైర్యం లాక్‌డౌన్ కలిగించింది. కొందరికి రోజు బయటకు వెళ్లనిది గడవదు. లాక్‌డౌన్ సమయంలో చాలా రోజులుగా మద్యం షాపులు మూసివున్నాయి. ఇంట్లో ఉండాలంటే తెగబోర్ కొట్టేస్తుంటుంది. అలాంటిది లాక్‌డౌన్ సమయం కారణంగా బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండగలను అన్న భరోసా కలిగించింది. |
అడ్డంకులు తొలగించుకుని ముందుకు సాగడమే ముందున్న లక్ష్యంసాధారణంగా ప్రభుత్వాలు ఏదైన పనులు చేయాలంటే కొన్ని రోజులు, నెలలు పట్టేది అలాంటిది లాక్‌డౌన్ సమయంలో క్షణాల్లోనే పనులు చేసేలా చేసింది. ఇక మొత్తం మీద బతకడానికి ఒక మార్గం ఉంటుంది.. అడ్డంకులను తొలగించుకుని ముందుకు సాగడమే మన ముందున్న కర్తవ్యం.
|