ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గడగడలాడిస్తుంది. ఆయా దేశాలు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్‌ను విధించాయి. కేంద్ర ప్రభుత్వంసైతం భారత్‌లో కరోనా వ్యాప్తి చెందకుండా నెలన్నరగా లాక్‌డౌన్‌ విధిస్తుంది. లాక్‌డౌన్‌తోనే ఈ మహమ్మారిని అరికట్టవచ్చని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. దీంతో ప్రతీసారి లాక్‌డౌన్‌ గడువును పొడిగిస్తూ వస్తున్నాయి. ఇటీవల కేంద్రం లాక్‌డౌన్‌ గడువును మే17వ తేదీ వరకు పొడిగించింది. దీనికితోడు కొన్ని రంగాలకు సడలింపు నిచ్చింది. తెలంగాణ ప్రభుత్వం మే 29వరకు లాక్‌డౌన్‌ను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ గడువును మే చివరి వరకు పొడిగించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధమవుతున్నారు.

Also Read :ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ సంచలన నిర్ణయం

ఈ సమయంలో ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. లాక్‌డౌన్‌ అనేది రాజ్యాంగ విరుద్ధమంటూ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర ప్రభుత్వం స్వాగతించడమేంటని ఆయన ప్రశ్నించారు. ఆన్‌లైన్‌ మీటింగ్‌లో పాల్గొన్న ఓవైసీ కరోనా కట్టడిలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల తీరును తప్పుబట్టారు. ప్రభుత్వాల తీరుతో వలస కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, వారివారి రాష్ట్రాలకు వెళ్తున్నారని అన్నారు. కరోనా ఎవరికైనా రావచ్చని, దానికి భయాందోళన చెందకుండా 8 నుంచి 10 రోజులు క్వారంటైన్‌లో ఉంటే సరిపోతుందని, క్వారంటైన్‌ అనేది మన మంచికే అన్నారు. మరి ఓవైసీ వ్యాఖ్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందిస్తాయా..? స్పందిస్తే ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Also Read : ఏపీ ఏకపక్ష నిర్ణయంపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *