ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ సంచలన నిర్ణయం

By Newsmeter.Network  Published on  12 May 2020 11:06 AM GMT
ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ సంచలన నిర్ణయం

వినాయక చవితి వస్తుందంటేనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల దృష్టంతా హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ మహాగణపతి ఉత్సవాలపైనే ఉంటుంది. ఇక్కడ భారీ ఎత్తులో గణపయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రతీయేటా రూపంలో కొత్తదనం సంతరించుకుంటూ గణపయ్య కనువిందు చేస్తాడు. అయితే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఖైరతాబాద్‌ గణేశ్‌‌ ఉత్సవ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఒక్క అడుగు ఎత్తులోనేగణేశ్‌డి విగ్రహం ఏర్పాటు చేస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు వెల్లడించారు. 66 సంవత్సరాలుగా ప్రతీయేటా గణేశ్‌‌ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు.

Also Read :రాత్రి 8గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని

గత ఏడాది 61అడుగుల ఎత్తులో భారీ విగ్రహాన్ని గణేశ్‌‌ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసింది. 12 తలలు, ఏడు అశ్వాలు, 12 సర్పాలతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ దఫా ఒక అడుగు ఎత్తు తగ్గించి విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ కమిటీ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది ఒక్క అడుగు ఎత్తులోనే గణేశ్‌డి విగ్రహం ఉంటుందని కమిటీ సభ్యులు ప్రకటించారు. దీనికితోడు ప్రతీ ఏడాది తొలి ఏకాదశి రోజు కర్రపూజను పూజ నిర్వహించి ఉత్సవ కమిటీ పనులు ప్రారంభిస్తుంది. ఈ ఏడాది ఆ కార్యక్రమాన్ని కూడా రద్దుచేసుకున్నట్లు తెలుస్తోంది. తొలుత 18న సాయంత్రం 5గంటలకు కర్రపూజ ప్రారంభిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు ప్రకటించినప్పటికీ వాయిదా వేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మొత్తానికి కరోనా ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు గాంచిన ఖైరతాబాద్‌ గణేశ్‌డిపైనా పడింది.

Also Read :కరోనా సోకితే పక్షవాతం వస్తుందా..? ఎంతవరకు అవకాశముంటుంది?

Next Story