మహారాష్ట్ర, తమిళనాడుల్లో మే 31 వరకు లాక్‌డౌన్‌

By Newsmeter.Network  Published on  17 May 2020 10:17 AM GMT
మహారాష్ట్ర, తమిళనాడుల్లో మే 31 వరకు లాక్‌డౌన్‌

కరోనావైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నివిధాల చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ గడువు నేటితో పూర్తికానుంది. ఈనెల 31వరకు లాక్‌డౌన్‌ను పొడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆదివారం సాయంత్రం అధికారికంగా కేంద్రం వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ఇదిలాఉంటే రాష్ట్రాలుసైతం తమత రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తిని అడ్డుకొనేందుకు లాక్‌డౌనే ప్రధాన మార్గంగా భావిస్తున్నాయి. దీంతో మే చివరి నాటికి లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నాయి. దేశంలో అత్యధిక కరోనా కేసులతో సతమతమవుతున్న మహారాష్ట్ర ప్రభుత్వం మే 31వరకు లాక్‌డౌన్‌ను పొడిగించింది. ఆ రాష్ట్రంలో కరోనా భారిన పడినవారి సంఖ్య 30వేలు దాటింది.

Also Read :క్రిమినాశకాల పిచికారీతో కరోనా అంతంకాదు

శనివారం ఒక్కరోజే కొత్తగా 1,606 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఆ రాష్ట్రంలో ముంబయిలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. శనివారం ఒక్కరోజే ముంబయిలో 884 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటూనే మరోవైపు బృహన్‌ ముంబయి కార్పొరేషన్‌ (బీఎంసీ)లో కొత్త కంటైనెంట్‌ పాలసీ విధానాన్ని తీసుకొస్తున్నారు. మరోవైపు తమిళనాడు ప్రభుత్వంసైతం ఈనెల 31వరకు లాక్‌డౌన్‌ గడువును పెంచింది. ఇప్పటికే తమిళనాడులో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా ఉంది. ఈ పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ను తొలగిస్తే మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వం భావిస్తుంది. దీంతో కరోనా మహమ్మారిని అడ్డుకొనేందుకు లాక్‌డౌన్‌ను ఆ ప్రభుత్వం పొడగించింది.

Also Read :రూ. 12వేలలోనే పెండ్లి తంతుపూర్తి

Next Story
Share it