కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తూ ఉండడంతో తిరిగి జనజీవనం సాధారణ స్థితికి వస్తోంది. కానీ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ ఉండడం అధికారులను, ప్రజలను టెన్షన్ పెడుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో హోమ్ మినిస్ట్రీ మరోసారి దేశవ్యాప్తంగా పూర్తి స్థాయి లాక్ డౌన్ ను అమలుచేయబోతోందన్న వార్త సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. జూన్ 15 నుండి మరోసారి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను అమలుచేయబోతున్నారని ట్విట్టర్, ఫేస్ బుక్ లోనే కాకుండా వాట్సప్ లో కూడా మెసేజీ వైరల్ అవుతోంది.

ఈ వైరల్ మెసేజీలో జీ న్యూస్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఉంచి వైరల్ చేస్తూ ఉన్నారు.ఇతర వార్తా సంస్థలకు సంబంధించిన న్యూస్ అంటూ వేరువేరు స్క్రీన్ షాట్ లను సోషల్ మీడియాలో వైరల్ చేయడం మొదలుపెట్టారు.

F1

15 जून के बाद फिर से हो सकता है सम्पूर्ण लॉकडॉउन गृह मंत्रालय ने दिये संकेत ट्रेन और हवाई सफर पे लगेगा ब्रेक। అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న మెసేజీలో ఉంచారు. 15 జూన్ తర్వాత దేశంలో సంపూర్ణ లాక్ డౌన్ ను అమలు చేయబోతున్నారని.. ట్రైన్లు, విమానాలకు కూడా బ్రేక్ లు పడబోతున్నాయని అందులో ఉంది.

నిజ నిర్ధారణ:

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలు 'పచ్చి అబద్ధం'.

తమ వార్తా సంస్థ లోగోను ఉంచి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని జీ న్యూస్ సోషల్ మీడియా అకౌంట్స్ లో స్పష్టం చేసింది.జీ న్యూస్ కు సంబంధించిన టెంప్లేట్స్ లో ఎన్నో తప్పులు ఉన్నట్లు గుర్తించాం. జీ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ టెంప్లేట్ అలా ఉండదని తెలుస్తోంది. PIB Fact Check కూడా ఈ న్యూస్ అబద్ధమని.. హోమ్ మినిస్ట్రీ ఇప్పటి వరకూ ఎటువంటి ఆర్డర్స్ ఇవ్వలేదని స్పష్టం చేసింది. PIB Telangana కూడా తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎటువంటి ఆర్డర్లు ఇవ్వలేదని.. తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తున్నారని స్పష్టం చేసింది.

ఇక మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వెబ్ సైట్ లో కూడా జూన్ 15 నుండి లాక్ డౌన్ ను అమలు చేయబోతున్నారన్న ఎటువంటి సమాచారం కూడా లేదు.

మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ జూన్ 15 నుండి మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ ను అమలుచేయబోతోందన్న వార్త 'అబద్ధం'.

Also Read

Claim Review :   Fact Check : జూన్ 15 నుండి మళ్లీ లాక్ డౌన్ ను అమలుచేయబోతున్నారా.?
Claimed By :  Unknown
Fact Check :  false

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story