క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని కుదిపేస్తోంది. రోజురోజుకు క‌రోనా మ‌ర‌ణాలు అధిక‌మ‌వుతున్నాయి. దేశంలో పంజా విసురుతున్న ఈ మ‌హ‌మ్మారి చాప‌కింద నీరులా వ్యాపిస్తోంది. నేడు జ‌న‌తా క‌ర్ఫ్యూ విధించిన కేంద్రం… తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా కేసులు న‌మోదైన 75 జిల్లాలో లాక్ డౌన్ ప్ర‌క‌టించింది. వీటితో పాటు తెలంగాణ నుంచి 5 జిల్లాలు, ఏపీ నుంచి 3 జిల్లాలున్నాయి.

ఇక తెలంగాణ‌లో హైద‌రాబాద్‌, మేడ్చ‌ల్‌, మ‌ల్కాజ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, భ‌ద్రాది కొత్త‌గూడం జిల్లాల‌ను లాక్‌డౌన్ చేయాల‌ని ఆదేశించింది. ఇక ఏపీలో ప్ర‌కాశ్‌, విజ‌య‌వాడ‌, విజ‌య‌న‌గ‌ర్ జిల్లాల‌కు లాక్‌డౌన్ చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది. ఈ లాక్‌డౌన్ మార్చి 31 వ‌ర‌కు అమ‌ల్లో ఉండ‌నుంది. అంతేకాకుండా దేశ వ్యాప్తంగా అన్ని రైళ్ల‌ను కూడా మార్చి 31 వ‌ర‌కు ర‌ద్దు చేసింది. కాగా, ఈ నెలాఖ‌రు వ‌ర‌కు గూడ్స్ రైళ్ల‌కు మాత్రం మిన‌హాయింపు ఇచ్చింది.

ఇప్ప‌టికే దేశంలో క‌రోనా కేసులో 350కి చేరువ‌లో ఉంది. ముఖ్యంగా మ‌హారాష్ట్ర‌లో అధికంగా 74 కేసులు న‌మోదు కాగా, ఈ రోజే 10 కేసులు న‌మోద‌య్యాయి. ముంబైలో 6, పుణేలో 4 కేసుల చొప్పున క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఇక ఢిల్లీలో 27, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో 26, రాజ‌స్థాన్‌లో 23 మందికి క‌రోనా సోకింది. కాగా, తెలంగాణ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 22 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.