తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ జిల్లాలివే
By సుభాష్ Published on 22 March 2020 6:06 PM ISTకరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. రోజురోజుకు కరోనా మరణాలు అధికమవుతున్నాయి. దేశంలో పంజా విసురుతున్న ఈ మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. నేడు జనతా కర్ఫ్యూ విధించిన కేంద్రం... తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు నమోదైన 75 జిల్లాలో లాక్ డౌన్ ప్రకటించింది. వీటితో పాటు తెలంగాణ నుంచి 5 జిల్లాలు, ఏపీ నుంచి 3 జిల్లాలున్నాయి.
ఇక తెలంగాణలో హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, భద్రాది కొత్తగూడం జిల్లాలను లాక్‌డౌన్ చేయాలని ఆదేశించింది. ఇక ఏపీలో ప్రకాశ్, విజయవాడ, విజయనగర్ జిల్లాలకు లాక్‌డౌన్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ లాక్‌డౌన్ మార్చి 31 వరకు అమల్లో ఉండనుంది. అంతేకాకుండా దేశ వ్యాప్తంగా అన్ని రైళ్లను కూడా మార్చి 31 వరకు రద్దు చేసింది. కాగా, ఈ నెలాఖరు వరకు గూడ్స్ రైళ్లకు మాత్రం మినహాయింపు ఇచ్చింది.
ఇప్పటికే దేశంలో కరోనా కేసులో 350కి చేరువలో ఉంది. ముఖ్యంగా మహారాష్ట్రలో అధికంగా 74 కేసులు నమోదు కాగా, ఈ రోజే 10 కేసులు నమోదయ్యాయి. ముంబైలో 6, పుణేలో 4 కేసుల చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఢిల్లీలో 27, ఉత్తరప్రదేశ్‌లో 26, రాజస్థాన్‌లో 23 మందికి కరోనా సోకింది. కాగా, తెలంగాణలో ఇప్పటి వరకు 22 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.