40,000 లీటర్ల శానిటైజర్లను అందించి ఆ గొప్ప పని చేసిందెవరంటే..!

By అంజి  Published on  7 April 2020 5:36 AM GMT
40,000 లీటర్ల శానిటైజర్లను అందించి ఆ గొప్ప పని చేసిందెవరంటే..!

తెలంగాణ లో పలు ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ బ్రాండ్ ను తయారు చేస్తూ ఉంటారు. బ్లాక్ డాక్, టీచర్స్ ను తయారు చేసే డిస్ట్రిల్లరీస్ చాలా గొప్ప పని చేశాయి. వారు ఏకంగా 40000 లీటర్ల శానిటైజర్లను తయారు చేసి ప్రభుత్వానికి అందించారు. ముఖ్యంగా వైద్యులకు, ఆసుపత్రి సిబ్బంది కోసం తయారు చేయించారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది కోవిద్-19 వైరస్ ప్రబలకుండా చాలా కష్టపడుతూ ఉన్నారు.. అలాంటి వాళ్లకు శానిటైజర్ల కొరత రాకుండా ఉండాలని మద్యం డిస్ట్రిల్లరీస్ 40000 లీటర్ల శానిటైజర్లను తయారు చేశారు.

హెల్త్ వర్కర్లకు, పోలీసులకు, శానిటేషన్ వర్కర్లకు శానిటైజర్లు చాలా అవసరం.. ముఖ్యంగా డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందికి శానిటైజర్ల కొరత రాకూడదు.. ఎందుకంటే కరోనా వైరస్ పాజిటివ్ కేసులను, అనుమానితులను డైరెక్ట్ గా తాకేది వీరే కాబట్టి..!

మొత్తం 17 డిస్ట్రిల్లరీస్ ఈ శానిటైజర్లను తయారు చేసి తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(TSMIIDC) కు అందించాయి. కార్పొరేషన్ ఈ శానిటైజర్లను డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ద్వారా ఆసుపత్రులకు అందించనున్నాయని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొన్ని కంపెనీలు శానిటైజర్లను తయారు చేస్తాయి. ఇవనీ చాలా చిన్న కంపెనీలు కావడం.. మార్కెట్ లో శానిటైజర్ల కొరత ఎక్కువగా ఉంది. ఈ కంపెనీలు ఆ స్థాయిలో ప్రొడక్షన్ చేయలేకపోతున్నాను.

హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలైన సంగారెడ్డి, రంగా రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో 23 డిస్ట్రిల్లరీస్ ఉన్నాయి. కొన్నిటికి రోజుకు 5000 లీటర్లు ఉత్పత్తి చేయవచ్చని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ లైసెన్స్ ఇచ్చిందని సీనియర్ ఎక్సైజ్ ఆఫీసర్ ఒకరు తెలిపారు. ఏది ఏమైనా సరైన సమయంలో డిస్ట్రిల్లరీస్ కలిసి శానిటైజర్లను అందించడం అభినందనీయం.

Next Story
Share it