మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సేవలను వినియోగించుకోవాలని టీటీడీ నిర్ణయించింది. సీఎంవైఎస్ జగన్ ఆదేశాలుతో రమణ దీక్షితులకు ఆలయ ప్రవేశం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఆగమ సలహాదారుడిగా రమణ దీక్షితులను నియమిస్తున్నట్లు సమాచారం. నూతన అర్చకులకు మార్గదర్శకుడిగా రమణ దీక్షితుల సేవలను వినియోగించుకోవాలని టీటీడీ భావిస్తుంది. కోర్ట్ కేసుల పరిష్కారం తరువాత అర్చకత్వ బాధ్యతలను అప్పగించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. రమణ దీక్షితుల ఇద్దరు కుమారులను గోవింద రాజుల స్వామి ఆలయం నుంచి తిరుమల ఆలయానికి బదిలీ చేశారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.