శీతాకాలంలో ఆకులు ఎందుకు రాలుతాయంటే?

శీతాకాలంలో చెట్లకు ఉన్న ఆకులు మొత్తం రాలిపోవడాన్ని మనం గమనిస్తూనే ఉంటాం.. కానీ ఇలా ఎందుకు జరుగుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

By అంజి  Published on  23 Dec 2024 6:00 AM GMT
trees, leaves, winter

శీతాకాలంలో ఆకులు ఎందుకు రాలుతాయంటే?

శీతాకాలంలో చెట్లకు ఉన్న ఆకులు మొత్తం రాలిపోవడాన్ని మనం గమనిస్తూనే ఉంటాం.. కానీ ఇలా ఎందుకు జరుగుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చెట్లు ఆకుల ద్వారా ఎండ, కార్బన్‌ డై ఆక్సైడ్‌ని పొందుతూ తమకు కావాల్సిన పదార్థాలను తయారు చేసుకుంటాయి. దీన్నే కిరణజన్య సంయోగక్రియ అని అంటారు. ఈ ప్రక్రియలో క్లోరోఫిల్‌ అనే పదార్థం చాలా కీలకం. ఆకు గ్రీన్‌ కలర్‌లో ఉండటానికి ఇదే కారణం. అయితే ఈ పదార్థం సూర్యుడి నుంచి వచ్చే ఎండను గ్రహించి చెట్టు కోసం గ్లూకోజ్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఆ గ్లూకోజ్‌ చెట్టుకు ఆహారంగా, ఎనర్జీగా ఉపయోగపడుతుంది.

ఇక చలికాలం వచ్చినప్పుడు ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయి. దీంతో చెట్లకు ఎనర్జీ, ఆహారం ఎక్కువగా అవసరం ఉండదు. అందుకే చెట్టు ఆకుల్లోని క్లోరోఫిల్‌ ఉత్పత్తిని తగ్గించేస్తుంది. ఫలితంగా ఆకుల అడుగు భాగంలో అబ్సిసిషన్‌ పొర ఏర్పడి ఆకుల రంగు మారి, రాలిపోతాయి. అలాగే చలికాలంలో భూగర్భ జలాలు ఘనీభవిస్తాయి. దీని వల్ల చెట్లకు వేళ్ల ద్వారా నీరు అందదు. ఆకుల్లో వ్యర్థ పదార్థాలు పేరుకుపోతాయి. అలాగే రానున్న ఎండాకాలంలో చెట్లకు చాలా ఆహారం అవసరం అవుతుంది. దీనికి చురుగ్గా పని చేసే కొత్త ఆకులు కావాలి. అందకే చెట్టు తన ఆకులను వదిలించుకుంటుంది.

Next Story