కోడి ముందా? గుడ్డు ముందా?

కోడి ముందా? గుడ్డు ముందా? మీలో చాలా మంది ఈ చిక్కు ప్రశ్నను చిన్నప్పటి నుంచి ఎదుర్కొని ఉంటారు.

By అంజి  Published on  2 Feb 2024 1:45 PM IST
chicken, egg, chicken breed

కోడి ముందా? గుడ్డు ముందా?

కోడి ముందా? గుడ్డు ముందా? మీలో చాలా మంది ఈ చిక్కు ప్రశ్నను చిన్నప్పటి నుంచి ఎదుర్కొని ఉంటారు. కొంత కాలం క్రితం వరకు ఈ ప్రశ్నకు సరైన జవాబు ఎవరికీ తెలియదు. అయితే, ఇటీవల కాలంలో శాస్త్రవేత్తలు ఈ అంతుచిక్కని ప్రశ్నకు సమాధానం కనుగొన్నారు.

కోడే ముందు

గుడ్డు కంటే కోడే ముందని శాస్త్రవేత్తలు తేల్చేశారు. 51 శిలాజ జాతులు, 29 జీవ జాతుల్లో.. గుడ్లు పెట్టేవి, నేరుగా జన్మనిచ్చేవి అనే రెండు రకాల జీవులపై పరిశోధనలు చేసి కోడే ముందని తేల్చి చెప్పారు. ఇంతకీ గుడ్డు కంటే కోడే ముందని శాస్త్రవేత్తలు ఎలా నిర్ధారణకు వచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం..

కోడే ముందు పుట్టింది.. ఎలాగంటే?

మొదట్లో కోడి జాతి పక్షులు పునరుత్పత్తి కోసం నీటి సమీపంలో నివసించేవట. అంతేకాకుండా అప్పటి వాతావరణ పరిస్థితులు తగ్గట్టుగా తమ పిల్లలను గర్భంలోనే దాచుకుని పిల్లలకు నేరుగా జన్మనిచ్చేవట. పరిణామక్రమంలో కోడి జాతి పక్షులు నీటికి దూరంగా భూమిపై జీవించడానికి అలవాటు పడి.. గుడ్లు పెట్టడం ప్రారంభించాయట. అందుకే కోడే ముందు.

ఇతర పరిశోధనలు

మరికొన్ని పరిశోధనల ప్రకారం.. కోడి అండాశయంలో కనిపించే ఓవోక్లైడిడిన్ - 17 ప్రోటీన్‌ కీలకంగా ఉందట. గుడ్డు పెంకులు ఏర్పడటంపై ఓసీ - 17పై ఆదారపడి ఉంటుందని కొన్ని అధ్యయనాలు పేర్కొన్నాయి. ఈ ప్రోటీన్‌ కోడి శరీరంలో ఉంటేనే గుడ్డు ఏర్పడటం సాధ్యం అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో కోడి జాతి పక్షి నుంచి నేరుగా పుట్టిన కోడే.. మొట్టమొదటి గుడ్డు పెట్టిందని తేల్చారు.

ఆశ్చర్యపరిచే నిజాలు

ప్రస్తుతం మనుగడలో ఉన్న అన్ని జాతుల పాములు, కప్పలు, బల్లులు గుడ్లు పెడతాయని మనందరికీ తెలుసు. అయితే, ఇవి కూడా కోడి జాతి లాగే పరిణామక్రమంలో గుడ్డు పెట్టేవిగా మారాయట. ఇప్పటికీ కొన్ని రేర్‌ సందర్భాల్లో కొన్ని జాతుల పాములు, కప్పలు, బల్లులు నేరుగా పిల్లలకు జన్మనిస్తాయట.

Next Story