తెలుగు ప్రజలకు అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఉగాది ఒకటి. ఈ పర్వదినాన చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఉగాది పచ్చడి తినాలి. ఉదయాన్నే తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి. అయితే స్నానానికి ముందు తలపై నువ్వుల నూనెను పెట్టించుకోవాలి. దీని వల్ల జ్యేష్టాదేవీ తొలగిపోతుంది.
కొత్తబట్టలు ధరించిన తర్వాత కుల దైవాన్ని ఆరాధించాలి. కుటుంబ సభ్యులతో కలిసి పంచాంగ శ్రవణం వినాలి. సృష్టి ఆరంభం రోజు కాబట్టి ఇవాళ కొత్త పనులు మొదలు పెట్టొచ్చు. ఇంద్రధ్వజ, బ్రహ్మధ్వజ, రాజదర్శనం పూజలు చేస్తే శుభం కలుగుతుంది. బంగారం, వెండి వంటి వస్తువులు కొనుక్కోవచ్చు.
ఉగాది నాడు ఆధ్యాత్మిక చింతనతో కూడిన కొన్ని నియమాలను పాటించడం వల్ల, మన జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని పండితులు చెబుతున్నారు. గోపూజ తప్పనిసరి. పంచాంగ శ్రవణంలో ఫలితాలు అనుకూలంగా ఉంటే ఏ మాత్రం అహంకారానికి పోకూడదు. రోజంతా సంప్రదాయమైన కట్టుబొట్టు పాటించాలి. ఈ నియమాలు కేవలం ఆచారాలు మాత్రమే కాదు, ఇవి మన అంతరంగిక శుద్ధికి, దైవిక అనుగ్రహానికి మార్గం సుగమం చేస్తాయి.