ధూమపానం ఆరోగ్యానికి హానికరం ఈ విషయం తెలిసినా చాలా మంది ఈ దురలవాటు నుంచి బయటపడటం లేదు. దీని వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, నోటి క్యాన్సర్, గుండె జబ్బులు, పక్షవాతం సహా అనేక వ్యాధుల ముప్పు పెరుగుతోంది. ధూమపానం మానేస్తే మన ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు వస్తాయో డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. అవేంటే ఇప్పుడు చూద్దాం..
4 వారాలు ధూమపానం మానేసి వ్యాయామం చేస్తే.. ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది. లంగ్ క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది. ధూమపానం మానేసిన 8 వారాల్లో వ్యాధి నిరోధక శక్తి మెరుగుపడుతుంది. 2 నుంచి 12 వారాల్లో రక్త ప్రసరణ సక్రమంగా జరిగి ఊపిరితిత్తుల పని తీరు మెరుగుపడుతుంది. ఒకటి నుంచి తొమ్మిది నెలల కాలంలో దగ్గు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి. సంవత్సరం పాటు మానేస్తే.. గుండె సంబంధిత సమస్యలు సగానికి తగ్గుతాయి.
ధూమపానం మానేయడం వల్ల హైబీపీ, హృదయ స్పందనలు సాధారణ స్థితికి వస్తాయి. రక్త ప్రసరణలో కార్బన్‌మోనాక్సైడ్ నామమాత్రపు స్థాయికి చేరుకుంటుంది. నోరు, శరీరం నుంచి దుర్గంధం రావడం, జుట్టు ఊడటం వంటి సమస్యలు తగ్గుతాయి.