వాషింగ్‌ మెషీన్‌ వాడుతున్నారా? ఈ క్లీనింగ్‌ చిట్కాలు మీ కోసమే

వాషింగ్‌ మెషీన్‌ను ప్రతి రోజూ వాడుతున్నా.. దాన్ని క్లీన్‌ చేయడంలో చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటారు.

By అంజి  Published on  28 Jun 2024 6:00 PM IST
Washing Machine, cleaning tips, vinegar

వాషింగ్‌ మెషీన్‌ వాడుతున్నారా? ఈ క్లీనింగ్‌ చిట్కాలు మీ కోసమే

వాషింగ్‌ మెషీన్‌ను ప్రతి రోజూ వాడుతున్నా.. దాన్ని క్లీన్‌ చేయడంలో చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటారు. దాన్ని సరిగ్గా మెయింటైన్‌ చేయకపోతే క్రిములు, బ్యాక్టీరియా అభివృద్ధి చెంది ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చెడు వాసన, బూజు పేరుకుపోయి డస్ట్‌బిన్‌లా తయారవుతుంది. క్రమంగా దాని పని తీరు కూడా మందగిస్తుంది. కాబట్టి వాషింగ్‌ మెషీన్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం తప్పనిసరి. అయితే, మనకు ఈజీగా దొరికే వెనిగర్‌తో వాషింగ్‌ మెషీన్‌ను సులభంగా శుభ్రం చేయవచ్చు. ఇది చాలా ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది. అదెలాగంటే..

శుభ్రపరిచే విధానం

- ఫ్రంట్‌ లోడ్‌ వాషింగ్‌ మెషీన్‌ వాడుతున్నట్టయితే దాని తలుపుకు ఉండే రబ్బరు పట్టీని శుభ్రం చేయాలి. దానిపై మురికిని తొలగించడానికి మైక్రోఫైబర్‌ క్లాత్‌తో తుడవాలి. లేదంటే.. నీరు నిలిచిపోయి నాచు పట్టేస్తుంది.

- వాష్‌ డ్రమ్‌ లోపలి భాగంలో కొద్దిగా బేకింగ్‌ సోడా చల్లాలి. లాండ్రీ డిటర్జెంట్‌కు ఒక కప్పు వెనిగర్‌ వేసి కాసేపు ఆన్‌ చేసి వదిలేయాలి. ఆ తర్వాత మురికి నీరు బయటికి వస్తుంది.

- వాషింగ్‌ మెషిన్‌ బయట శుభ్రం చేయడానికి శుభ్రమైన క్లాత్‌, సిట్రస్‌ క్లీనర్‌ వాడాలి. వాషఙంగ్‌ మెషీన్‌ను గోడకు దగ్గరగా పెట్టకూడదు. దీని వల్ల వెనక వైపు ఉండే పైపుల దెబ్బతింటాయి.

- మెషీన్‌ పైపులు లీకేజీ లేకుండా చూసుకోవాలి. వీటిలో పౌడర్లకు బదులు లిక్విడ్‌ డిటర్జెంట్లు వాడటం మంచిది. బట్టలు ఉతికిన తర్వాత డోర్‌ ఓపెన్‌ చేసి పెట్టుకోవాలి. దీని వల్ల లోపల తేమ పోయి పొడిగా మారుతుంది. దీని వల్ల బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా ఉంటుంది.

Next Story