బట్టలు ఎక్కువకాలం మన్నాలంటే?.. ఈ టిప్స్‌ పాటించండి

కొందరి బట్టలు ఎంత కాలమైనా పాతబడిపోకుండా, మన్నికగా ఉంటాయి. మరికొందరివి కొన్న కొంత కాలానికే పాత వాటిలా మారతాయి.

By అంజి  Published on  27 Jan 2025 12:45 PM IST
clothes, clothes tips, Dry wash

బట్టలు ఎక్కువకాలం మన్నాలంటే?

కొందరి బట్టలు ఎంత కాలమైనా పాతబడిపోకుండా, మన్నికగా ఉంటాయి. మరికొందరివి కొన్న కొంత కాలానికే పాత వాటిలా మారతాయి. ఇలా అవ్వడానికి దుస్తులు ఉతికే విధానం కూడా కారణమే, అయితే బట్టలు ఉతకడానికి కూడా ఒక పద్ధతి ఉందంటున్నారు నిపుణులు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

లినెన్‌ దుస్తుల్ని డ్రైవాష్‌ చేయించడం మంచిది. లేదంటే వాటి మన్నికను కోల్పోతాము. అక్రిలిక్‌ పెయింటెడ్‌ దుస్తులు ఉతికేటప్పుడు గోరు వెచ్చని నీటిని వాడొచ్చు. అయితే, నైలాన్‌ దుస్తుల్ని మాత్రం మిగతా దుస్తులతో కాకుండా విడిగా ఉతకాలి. డెనిమ్‌ ప్యాంట్లను వేణ్నీళ్లతో ఉతికితే రంగు దిగుతాయి. అవి వేరే వాటికి అంటుకుంటాయి. వీటిని చల్లని నీటితో మాత్రమే ఉతకాలి. కాస్త అవి లేత ఛాయల్లో ఉంటే కాస్త గోరు వెచ్చని నీళ్లతో ఉతకొచ్చు.

డార్క్‌ కలర్‌లో ఉన్న కాటన్‌ దుస్తులనూ చల్లటి నీటితో ఉతకాలి. అలాగే వాటికి ముడతలు పడకుండా తప్పక గంజి పెట్టడం, ఫ్యాబ్రిక్‌ సాఫ్టనర్‌ వాడటం వంటివి చేయాలి. ఊలు దుస్తుల్ని చల్లని నీటితో ఉతికి.. తిరగేసి నీడ పట్టున ఆరేయాలి. అప్పుడే మన్నికనిస్తాయి. పట్టు వస్త్రాలను చల్లని నీటిలో కాస్త ఉప్పు కలిపి ఉతకాలి. కానీ వీటిని నేరుగా ఎండ తగిలే చోట కాకుండా గాలి ధారాళంగా, వెలుతురు ఎక్కువగా ఉండే చోట ఆరబెట్టాలి.

Next Story