Gold: బంగారం గురించి మీకు తెలియని నిజాలు
బంగారం అంటే అందరికి ఇష్టమే. ముఖ్యంగా మన దేశంలో మహిళలకు అయితే మరీ ఎక్కువ. బంగారం కొనడం అలంకారం కోసమే
By అంజి Published on 2 April 2023 10:45 AM GMTGold: బంగారం గురించి మీకు తెలియని నిజాలు
బంగారం అంటే అందరికి ఇష్టమే. ముఖ్యంగా మన దేశంలో మహిళలకు అయితే మరీ ఎక్కువ. బంగారం కొనడం అలంకారం కోసమే కాదు.. చాలా మంది శుభ సూచికంగా కూడా భావిస్తారు. రాజుల కాలం నుంచి నేటి వరకు బంగారానికి ఆధరణ ఏ మాత్రం తగ్గలేదు. మరి అలాంటి గోల్డ్ గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి.
అంతరిక్షంలో
బంగారం భూమి మీదనే కాదు, అంతరిక్షంలో కూడా ఉపయోగపడుతుంది. వ్యోమగాములు తలపై ధరించే హెల్మెట్‌పై బంగారు పూత పోస్తారట. ఇది సూర్యుని నుంచి వెలువడే ప్రమాదకరమైన ఇన్ఫ్రారెడ్ కిరణాలను పరావర్తనం చెందేలా చేస్తుంది.
జీర్ణశక్తి
ఇప్పుడు చాలా మంది స్వీట్లపై వెండిని పల్చని పొరలా పూత పూసి తింటారు. పూర్వ కాలంలో బంగారాన్ని కూడా అలాగే వేసుకొని తినేవారట. ఇలా చేయడం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుందని వారి నమ్మకం.
బంగారం ఫోబియా
ఇతర దేశాల్లో బంగారం పెట్టుబడిగా భావిస్తారు. కానీ మన దేశంలో శుభసూచకంగా పరిగణిస్తారు. కొంతమంది బంగారం చూడడానికి భయపడుతుంటారు. దీన్నే ఆరో ఫోబియా అంటారు.
రక్తంలోనూ
మనిషి శరీరంలో 0.2 మిల్లీ గ్రాముల బంగారం ఉంటుందట. దీనిలో ఎక్కువ భాగం రక్తంలో ఉంటుంది. ఇక ప్రపంచం దేశాల్లోని బంగారంతో పోల్చితే మన దేశంలోనే 11 శాతం ఎక్కువ బంగారం ఉందట.
సముద్రాల్లో గోల్డ్
సముద్రం కూడా సుమారు 20 మిలియన్ టన్నుల బంగారం ఉందట. ఇది ప్రపంచంలోని ప్రజలందరికీ పంచితే ప్రతి ఒక్కరికి నాలుగు కిలోల చొప్పున బంగారం వస్తుందనే ప్రచారం ఉంది.