International Tea Day: 'టీ' గురించి ఆసక్తికరమైన విషయాలు
'టీ' అంటే ఇష్టపడనివారిని మనం చాలా అరుదుగా చూస్తుంటాం. ఇది లేనిదే చాలా మందికి రోజు మొదలవుదు, రోజు గడవదు.
By అంజి
International Tea Day: 'టీ' గురించి ఆసక్తికరమైన విషయాలు
'టీ' అంటే ఇష్టపడనివారిని మనం చాలా అరుదుగా చూస్తుంటాం. ఇది లేనిదే చాలా మందికి రోజు మొదలవుదు, రోజు గడవదు. ఉదయం టీ, సాయంత్రం టీ, బంధువుల వస్తే టీ, పనిముగించుకుని ఇంటికి వస్తే టీ.. ఇలా టీ తో మనకు ఎనలేని అనుబంధం ఏర్పడింది. నేడు అంతర్జాతీయ టీ దినోత్సవం. ఈ సందర్భంగా టీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..
'టీ' కథేంటో తెలుసా?
ప్రపంచంలోనే చైనా తర్వాత భారత్‌లోనే ఎక్కువ తేయాకు ఉత్పత్తి అవుతుంది. దీనికి కారణం అసోం రాష్ట్రమే. ఏటా 60 కోట్ల కిలోలకుపైగా తేయాకు ఇక్కడే ఉత్పత్తవుతుంది. ఇక్కడ దాదాపు 22 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వందల సంఖ్యలో 'టీ' తోటలు ఉన్నాయి.
'టీ' పుట్టిందిలా..
'షిన్ నాంగ్' అనే చక్రవర్తి తన కోటలో కూర్చుని తాగుతున్న వేడి నీటిలో కొన్ని ఆకులు గాలిలో తేలియాడుతూ వచ్చి పడ్డాయట. ఆకు పడిన నీటిని అలాగే తాగేశాడు ఆ చక్రవర్తి. రుచి బాగుందని ఆకుల చెట్టును కనిపెట్టి వాటితో 'టీ' తయారు చేయడం మొదలుపెట్టేశాడు.
గుర్తింపు
1660 కాలంలో భారత్‌లో తేయాకును ఔషధంగా ఉపయోగించేవారు అప్పటికే సింగ్‌పోస్ తెగ ప్రజలు ఈ తేయాకులను పండిస్తున్నారు. అయితే భారత్‌కు వ్యాపార నిమిత్తం వచ్చిన స్కాట్లాండ్ దేశస్థుడు రాబర్ట్ బ్రూస్ అస్సాంలోని రంగ్‌పూర్‌లో తేయాకు చెట్టు పెరుగుతుండటాన్ని గుర్తించారు
టీ గార్డెన్ టైం అంటే?
టైం జోన్ ప్రకారం.. ప్రపంచంలో ఒక్కో దేశంలో ఒక్కో సమయం ఉంటుంది. భారత్‌లోనూ ఇండియన్ స్టాండర్ట్ టైంను అనుసరిస్తారు. కానీ, అసోంలోని తేయాకు తోటల్లో IST కన్నా ఒక గంట ముందు ఉంటుంది. దీన్నే టీ గార్డెన్ టైం అని పిలుస్తుంటారు.