ఆరోగ్య బీమా తీసుకునే ముందు.. ఈ అంశాలు తప్పక పాటించండి.!

ఈ రోజుల్లో అనారోగ్యం పాలయితే.. ఆరోగ్య బీమా ఉంటే తప్ప గట్టెక్కలేని పరిస్థితి. బీమా లేని పక్షంలో రెండు మూడేళ్ల పాటు కూడబె

By అంజి  Published on  24 April 2023 9:00 AM GMT
health insurance, health, Health Insurance Policy

ఆరోగ్య బీమా తీసుకునే ముందు.. ఈ అంశాలు తప్పక పాటించండి.!

ఈ రోజుల్లో అనారోగ్యం పాలయితే.. ఆరోగ్య బీమా ఉంటే తప్ప గట్టెక్కలేని పరిస్థితి. బీమా లేని పక్షంలో రెండు మూడేళ్ల పాటు కూడబెట్టుకున్న పొదుపు సొమ్ము అంతా వైద్య ఖర్చులకు ఆవిరైపోతుందంటే ఆశ్చర్య పోనవసరం లేదు. అయితే ఈ బీమా పాలసీలు తీసుకునే ముందు కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.

- ఆరోగ్య బీమా తీసుకునే ముందు దరఖాస్తులో అన్నీ సరైన వివరాలే ఇవ్వాలి. ఇప్పటికే ఉన్న జీవనశైలి వ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలు, స్మోకింగ్‌, డ్రింకింగ్‌ వంటి అలవాట్లను ముందుగానే తెలియజేయాలి. లేకుంటే.. క్లెయిమ్‌ సమయంలో ఇబ్బందులు తప్పవు.

- ఆరోగ్య బీమా విషయంలో కొన్ని జబ్బులకు వెయిటింగ్‌ పీరియడ్ 1 - 4 ఏళ్లు ఉంటుంది. కనుక తక్కువ వెయిటింగ్‌ పీరియడ్‌ పాలసీని ఎంచుకోవాలి.

- ఆయుర్వేదం, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి వంటి చికిత్సలు ఆయుష్‌ కిందకి వస్తాయి. వీటికి బీమా కవరేజీ ఉంటుంది. కానీ, కొన్ని బీమా సంస్థలు ఆయుష్‌ చికిత్సకు పరిమితులు విధిస్తున్నాయి. అందుకే మంచి కవరేజీని అందించే బీమా సంస్థను ఎంచుకోవాలి.

- ప్రస్తుతం ఉన్న ఆరోగ్య బీమా పాలసీ మీద కొంత అదనపు ప్రీమియం చెల్లించి యాడ్‌ - ఆన్‌ లేదా రైడర్లు జతచేసుకుంటే వీలైనంత ఎక్కువ ప్రయోజనాన్ని పొందొచ్చు.

- ఉదా. క్రిటికల్‌ ఇల్నెస్ రైడర్‌ను ఎంచుకుంటే.. బీమా సంస్థ జాబితాలో ఉన్న ఏదైనా తీవ్రమైన అనారోగ్యం కలిగితే 15 రోజుల వ్యవధి (సర్వైవల్‌ పీరియడ్) తర్వాత బీమా సంస్థ పాలసీలో పేర్కొన్న మొత్తాన్ని చెల్లిస్తుంది.

- టాప్‌- అప్‌, సూపర్‌ టాప్ అప్‌ పాలసీలు తీసుకుంటే.. ప్రాథమిక ఆరోగ్య బీమా కవరేజ్ దాటినప్పుడు ఇవి ఆదుకుంటాయి.

Next Story