సమ్మర్‌లో కూల్‌డ్రింక్స్ తెగేసి తాగేస్తున్నారా?.. ఒక్క నిమిషం ఇది చదవండి
సమ్మర్‌లో చాలా మంది కూల్‌డ్రింక్స్ సీసాల కొద్దీ తాగేస్తుంటారు. తిన్నది అరగడనికి , దాహం వేసినప్పుడు కూడా కూల్ డ్రింక్స్
By అంజి Published on 17 May 2023 9:00 AM GMTసమ్మర్‌లో కూల్‌డ్రింక్స్ తెగేసి తాగేస్తున్నారా?.. ఒక్క నిమిషం ఇది చదవండి
సమ్మర్‌లో చాలా మంది కూల్‌డ్రింక్స్ సీసాల కొద్దీ తాగేస్తుంటారు. తిన్నది అరగడనికి , దాహం వేసినప్పుడు కూడా కూల్ డ్రింక్స్ లాగించేస్తుంటారు. కానీ ఇది ఏ మాత్రం మంచిది కాదని, వీటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు
- కూల్‌డ్రింక్స్ శరీరాన్ని చల్లబర్చటానికి బదులుగా యాసిడ్ స్థాయిలను పెంచడంతో షుగర్ లెవెన్స్ పెరిగిపోతాయి. దీని వల్ల టైప్ 2 డయాబోటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
- కూల్ డ్రింక్స్ తాగడం వల్ల దంతాలు కూడా బలహీనపడతాయి. ఇవి తాగని వారి దంతాల కంటే, తాగే వారి దంతాలు తొందరగా ఊడిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
- శీతల పానియాల్లో కేలరీలు, షుగర్ కంటెంట్ అధికంగా ఉంటాయి. వీటి వల్ల బరువు పెరుగుతారు. కూల్స్‌డ్రింక్స్‌లో ఉండే కెఫిన్, శరీరంలో అధికంగా డోపమైన్ ఉత్పత్తి చేస్తుందని, అందువల్ల రక్తపోటు పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.
- గర్భవతులు ఎక్కువగా కూల్‌డ్రింక్స్ తాగితే గర్భస్రావం అయ్యే ప్రమాదం కూడా ఉందట. దీన్ని తీసుకోవడం వల్ల గ్యాస్, ఎసిడిటీ సమస్యలు రెట్టింపు అవుతాయి
- వీటికి ఆకర్షణీయమైన రంగులు తెచ్చిపెట్టే కృత్రిమ రంగులు, స్వీటెనర్లు మెదడు కణాలను నాశనం చేస్తాయి. దీంతో జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఆలోచనల్లో స్పష్టత లోపిస్తుంది. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం క్రమేపీ తగ్గుతుంది. అదే పనిగా - - కూల్‌డ్రింక్స్ తాగటం వల్ల నిద్రలేమీ సమస్యలు ఉత్పన్నమౌతాయి.
- కూల్‌డ్రింక్స్ తాగడం బాగా అలవాటైన వారు, వాటికి బదులు పండ్ల రసాలను తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.