ప్రతి నెల మాదిరిగానే అక్టోబర్‌లో కూడా కొన్ని నిబంధనల్లో మార్పులు వచ్చాయి. ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ కార్డు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు సహా బడ్జెట్‌లో ప్రకటించిన కొన్ని విషయాలకు సంబంధించి కూడా పలు మార్పులు చోటు చేసుకున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
వివాద్ సే విశ్వాస్ 2.0: వివాద్ సే విశ్వాస్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2020లో తీసుకొచ్చింది. దీనికి కొనసాగింపుగా తాజా బడ్జెట్‌లో వివాద్ సే విశ్వాస్ 2.0ను ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ఆదాయపు పన్ను వివాదాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరిస్తారు.
ఆధార్ కార్డు: ఐటీఆర్ ఫైల్ చేయడానికైనా, పాన్‌కార్డు దరఖాస్తు చేసుకోవాలన్నా ఇది వరకు ఆధార్ నంబర్ లేదా ఎన్‌రోల్‌మెంట్ సంఖ్యను ఉపయోగించేవారు. అయితే కొత్త నిబంధనల ప్రకారం ఇకపై ఎన్‌రోల్‌మెంట్ నంబర్‌ను వాడరు. కేవలం ఆధార్ సంఖ్యనే వినియోగించాలి.
ఆస్తిని విక్రయిస్తే: స్థిరాస్తి విక్రయాల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.50 లక్షల కన్నా విలువైన ఆస్తిని అమ్మితే.. దానిపై 1 శాతంం టీడీఎస్ చెల్లించాలి.