యూరిక్ యాసిడ్ సమస్యను తగ్గించే ఫ్రూట్స్ ఇవే
మన శరీరం సహజంగా విసర్జించే వ్యర్థ పదార్థాల్లో యూనిక్ యాసిడ్ ఒకటి. ఇది మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది.
By అంజి
యూరిక్ యాసిడ్ సమస్యను తగ్గించే ఫ్రూట్స్ ఇవే
మన శరీరం సహజంగా విసర్జించే వ్యర్థ పదార్థాల్లో యూనిక్ యాసిడ్ ఒకటి. ఇది మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. దీని విసర్జన సరిగా జరగకపోతే యూరిక్ యాసిడ్ రక్తంలోనే ఉండిపోయి స్పటికాలు మారి కీళ్లు, వాటి చుట్టూ ఉండే కణజాలాల్లోకి చేరుతుంది. ఫలితంగా చేతి, కాలి వేళ్లలో ఎక్కువ నొప్పి, వేళ్లు, కీళ్ల దగ్గర వాపు కనిపిస్తుంది. కొందరిలో పాదాలు, కాలి వేళ్లు, కీళ్ల దగ్గర ఎర్రగా మారుతుంది. ఈ సమస్యను నుంచి ఉపశమనానికి ఈ పండ్లు తీసుకుంటే మంచిది.
వేసవిలో ప్రతి రోజూ కొద్ది పరిమాణంలో పుచ్చకాయ తినడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
చెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు యూరిక్ యాసిడ్ స్థాయిని, కీళ్లలో మంటను తగ్గిస్తాయి.
బొప్పాయిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగుపరిచి యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రిస్తుంది. కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో సాయపడుతుంది.
దోసకాయలో నీరు, ఫైబర్ ఎక్కవగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా మూత్రం ద్వారా యూరిక్ యాసిడ్‌ను తొలగించడంలో కూడా సహాయపడుతుంది.
నారింజలో విటమిన్ సి ఉంటుంది. ఇది సిట్రిక్ యాసిడ్ యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.