ప్రపంచంలో ఏ దేశమైనా ప్రజలపై పన్నులను విధిస్తాయి. అయితే కొన్ని దేశాలు తమ పౌరులపై ప్రత్యక్ష పన్నులు విధించవు. కేవలం పరోక్ష పన్నులు మాత్రమే వసూలు చేసి దేశ ఆర్థిక వ్యవస్థని నడిపిస్తాయి. ఆ దేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
యూఏఈ.. ఈ దేశంలో పర్యాటక, చమురు రంగాల కారణంగా ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉంది. ఇక్కడి ప్రభుత్వం వ్యాట్, ఇతర సుంకాల రూపంలో కేవలం పరోక్ష న్నులు మాత్రమే వసూలు చేస్తుంది.
కువైట్.. ఈ దేశం చమురు ఉత్పత్తి వల్ల భారీ ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. దీని వల్ల అక్కడ ఎలాంటి ప్రత్యక్ష న్నులు వసూలు చేయడం లేదు.
సౌదీ అరేబియా.. ఈ దేశంలో పరోక్ష పన్నుల విధానం వల్ల ఈ దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా నడుస్తోంది.
ఒమన్.. ఈ దేశం గ్యాస్ విక్రయం వల్ల లభించే ఆదాయంతో ఈ దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. దీంతో అక్కడ ప్రత్యక్ష పన్ను వసూలు చేయరు.
ఈ దేశాలతో పాటు ఖతర్, కేమాన్ దీవులు, బ్రూనై, బహమాస్ వంటి దేశాల్లో కూడా ప్రజల దగ్గర నుంచి ప్రభుత్వం ప్రత్యక్ష పన్నులు వసూలు చేయదు.