లేట్ ప్రెగ్నెన్సీతో నష్టాలే కాదు.. లాభాలు కూడా!
పెళ్లైన వెంటనే పిల్లల్ని కనడం ఒకప్పుడు కనిపించేది. ఇప్పుడు మాత్రం తమ కెరీర్ కోసం చాలా మంది దంపతులు పిల్నల్ని కనడం వాయిదా వేసుకుంటున్నారు.
By అంజి Published on 5 March 2024 4:37 AM GMTలేట్ ప్రెగ్నెన్సీతో నష్టాలే కాదు.. లాభాలు కూడా!
పెళ్లైన వెంటనే పిల్లల్ని కనడం ఒకప్పుడు కనిపించేది. ఇప్పుడు మాత్రం ఆర్థికంగా స్థిరపడటం, తమ కెరీర్ కోసం చాలా మంది దంపతులు పిల్నల్ని కనడం వాయిదా వేసుకుంటున్నారు. వీరిలో చాలా మంది 35 ఏళ్ల తర్వాత పిల్లల్ని కనడానికి సిద్ధమవుతున్నట్టు అనేక అధ్యయనాల్లో తేలింది. అయితే 35 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ రావడం వల్ల కొన్ని సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఈ లేట్ ప్రెగ్నెన్సీ వల్ల కొన్ని లాభాలు ఉన్నాయంటున్నారు.. అవేంటో చూద్దాం..
ఈ సమస్యలు వచ్చే ఛాన్స్
35 ఏళ్లు దాటక గర్భం ధరిస్తే మహిళల్లో మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది తల్లీ, బిడ్డ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. పుట్టే పిల్లలకు జన్యుపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆలస్యంగా గర్భం దాల్చడం మహిళల మానిసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మహిళల్లో ఒత్తిడి, డిప్రెషన్ లక్షణాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. 35 ఏళ్లు దాటిన తర్వాత ప్రెగ్నెంట్ అయిన మహిళలకు సాధారణ ప్రసవం అయ్యే అవకాశం తక్కువ. వీరికి సిజేరియన్ పద్ధితిలోనే ప్రసవాన్ని చేస్తారు. అలాగే పుట్టే పిల్లలు కూడా తక్కువ బరువు ఉంటారు. కొందరు పిల్లలు వైకల్యంతో పుట్టే అవకాశం ఉంది.
కొన్ని లాభాలు కూడా..
లేట్ ప్రెగ్నెన్సీ వల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయట. 35 ఏళ్లు దాటిన తర్వాత పిల్లల్ని కనేసరికి అప్పటికి తల్లిదండ్రులు ఆర్థికంగా స్థిరపడతారు. అప్పుడు పిల్లల పెంపకం భారంగా ఉండదు. వారి మంచి భవిస్యత్తుకు ప్రణాళికలు వేసుకోవచ్చు. 35 ఏళ్లు దాటిన తర్వాత మహిళల ఆలోచన స్పష్టంగా ఉంటుంది. సహనం ఎక్కువగాఉంటుంది. పిల్లల అల్లరిని అర్థం చేసుకొని వారి పెంపకం, ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉంది. 29 ఏళ్ల లోపు చివరి బిడ్డను కన్న వారితో పోలిస్తే 33 ఏళ్ల తర్వాత తమ చివరి బిడ్డకు జన్మనిచ్చిన మహిళలు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉన్నట్టు ఓ అధ్యయనంలో తేలింది. మెజార్టీ ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వీలైనంత వరకు 30 ఏళ్లలోపే బిడ్డకు జన్మనిచ్చేందుకు ప్లాన్ చేసుకోవాలి. అది తల్లీ, బిడ్డల ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు.