చలికాలం ఎక్కువసేపు పడుకుంటున్నారా?
శీతాకాలంలో రాత్రి పూట చలి ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది ఎక్కువసేపు పడుకోవడానికే ఆసక్తి చూపిస్తుంటారు.
By అంజి Published on 26 Dec 2024 1:45 PM ISTచలికాలం ఎక్కువసేపు పడుకుంటున్నారా?
శీతాకాలంలో రాత్రి పూట చలి ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది ఎక్కువసేపు పడుకోవడానికే ఆసక్తి చూపిస్తుంటారు. సాధారణంగా రోజుకు 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం. అయితే ఈ కాలంలో ఉదయం ఆలస్యంగా నిద్రలేస్తుంటారు. 10, 11 గంటల పాటు నిద్రపోతుంటారు. ఇది ఇప్పుడు మంచిగా అనిపించినా తర్వాత మన స్లీప్ సర్కిల్‌ను దెబ్బతీసి కొన్ని ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. పగలు ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల రాత్రి వేగంగా నిద్రపట్టదు. అతి ఆలోచనలు, తలనొప్పి వంటివి వస్తాయి. ఈ అతినిద్ర అలవాటు అయితే టైప్ - 2 డయాబెటిస్ (మధుమేహం) ముప్పు కూడా పెరుగుతుందట.
అతి నిద్ర వల్ల జీవ గడియారంపై ప్రభావం పడి గుండె సంబంధిత సమస్యలు పెరగడం, అనాసక్తి, పనిపట్ల నిర్లక్ష్యం, వాయిదావేసే తత్వం, ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి ఆరోగ్య సమస్యలు కనిపిస్తాయి. ఎక్కువసేపు పడుకునే ఉండటం వల్ల నడుము, మెడ, కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం లేకపోలేదు. అందుకే కాలం ఏదైనా సరే 7 నుంచి 9 గంటలకంటే తక్కువ సమయమే పడుకోవడం మేలు. ఈ సమయంలో రాత్రి వేగంగా పడుకుని ఉదయమే లేచి కాస్త సమయాన్ని వ్యాయామానికి కేటాయించాలని నిపుణులు సూచిస్తున్నారు.