అద్దెకు ఊరు.. ఒక్క రోజుకు ఎంతో తెలుసా?

Rent an entire village in Italy petritoli. సాధారణంగా ఎవరైనా ఏదైనా పని మీద బయటకు పనికి వెళ్తే.. అక్కడ హోటల్స్‌లోని రూమ్‌లను

By అంజి  Published on  21 Dec 2022 5:08 PM IST
అద్దెకు ఊరు.. ఒక్క రోజుకు ఎంతో తెలుసా?

సాధారణంగా ఎవరైనా ఏదైనా పని మీద బయటకు పనికి వెళ్తే.. అక్కడ హోటల్స్‌లోని రూమ్‌లను అద్దెకు తీసుకుంటారు. కొద్ది రోజులు అక్కడే ఉండాలనుకుంటే ఇల్లు అదె తీసుకుంటారు. ఇది కామన్. కానీ ఇటలీ దేశంలో విచిత్రమైన ఊరు ఉంది. నిర్ణీత మొత్తం చెల్లించి.. ఏవరైనా ఆ ఊరును అద్దెకు తీసుకోవచ్చు. దీంతో అద్దె చెల్లించినన్ని రోజులు.. ఆ ఊరిలో మనకు నచ్చింది చేసుకోవచ్చు.. నచ్చినట్టు ఉండొచ్చు. ఇంతకీ ఆ ఊరు ఇటలీ దేశంలో ఎక్కడ ఉందో చెప్పలేదు కదా?. ఇటలీ నడిబొడ్డున ఉండే లె మార్షె ప్రాంతంలో ఆ ఊరు ఉంది.

ఆ ఊరి పేరు పెట్రిటోలి. ఇది మధ్యయుగం నాటికి చెందిన గ్రామం. రోమన్‌ నాగరికత కాలం నాటి పురాతన కట్టడాలు ఈ ఊరిలో ఉంటాయి. వాటితో పాటు నేలమాళిగలు, బోటిక్‌ లాడ్జింగులు, ముప్పై ఏడు పడక గదుల భారీ రాచప్రసాదం, రంగస్థల వేదిక వంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. తొమ్మిది కిచెన్‌లు, రెస్టారెంట్, 19 బాత్‌రూమ్‌లు ఉన్నాయి. ఈ ఊరును అద్దెకు తీసుకోవాలంటే రోజుకు 1303 పౌండ్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే మన భారత కరెన్సీలో రూ.1,28,577లు అన్నమాట. యూరప్‌ దేశాల్లోని చాలా మంది ధనవంతుల కుటుంబాల సమావేశాలు, వివాహాలు, పుట్టిన రోజులు వంటి కార్యక్రమాల కోసం ఈ ఊరును ఎక్కువగా అద్దెకు తీసుకుంటున్నారు. ఈ గ్రామం సముద్రమట్టానికి 300 మీటర్ల ఎత్తున ఉంది.


దీంతో ఈ గ్రామంలో వాతావరణం చాలా ఆహ్లాదభరితంగా ఉంటుంది. పెట్రిటోలి గ్రామం చుట్టూ అందమైన కొండలు ఉంటాయి. గ్రామంలోని చాలా భాగం వాహనాల రాకపోకల బంద్. వీధులు కాఫీ దుకాణాలు, కిరాణా దుకాణాలు, జిలాటో పార్లర్‌లు, పిజ్జేరియాలతో నిండి ఉన్నాయి. అడ్రియాటిక్ తీరం పెట్రిటోలీ నుండి కేవలం 12 మైళ్లు (19.3 కిలోమీటర్లు) దూరంలో ఉంది. కాబట్టి మీరు సమీపంలోని కలలు కనే బీచ్‌ల ప్రయోజనాన్ని పొందవచ్చు . ఇతర సుందరమైన చిన్న పట్టణాలను కూడా చూడొచ్చు. గ్రామంలో 50 నుంచి 200 మంది (సుమారు 90 మంది కోటలో ఉండగలరు) మధ్య నిద్రించవచ్చు. చెప్పాలంటే.. ఇలాంటి గ్రామంలో ఒకటి ఫ్రాన్స్‌ దేశంలో కూడా ఉంది.

Next Story