మీ బైక్ మైలేజ్ ఇవ్వడంలేదా.. అయితే ఇలా చేయండి

Not giving your bike mileage?.. but increase your bike mileage by doing this. ప్రస్తుతం బైక్ అనేది అందరి లైఫ్‌లో ఒక భాగమైపోయింది. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతీ

By అంజి  Published on  27 Jan 2023 11:45 AM GMT
మీ బైక్ మైలేజ్ ఇవ్వడంలేదా.. అయితే ఇలా చేయండి

ప్రస్తుతం బైక్ అనేది అందరి లైఫ్‌లో ఒక భాగమైపోయింది. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ బైక్ వాడుతున్నారు. ప్రతీ ఇంట్లో దాదాపుగా బైక్ లేదా స్కూటీ ఉంటోంది. అయితే బైక్ వాడే అందరి కామన్ సమస్య ‘మైలేజ్’. చాలా మంది తమ బైక్ మైలేజ్ ఇవ్వడంలేదని ఫీలవుతుంటారు. కానీ ఈ కొన్ని టిప్స్ పాటిస్తే బైక్ మైలేజ్‌ను పెంచుకోవచ్చు.

ఆన్ టైం సర్వీసింగ్

బైక్ వాడే చాలా మంది చేసే తప్పు సరైన సమయానికి సర్వీసింగ్ చేయించకపోవడం. ఇప్పుడున్న ఉరుకులు పరుగుల జీవితాల్లో సరైన సమయానికి సర్వీసింగ్ చేయించడం కష్టమే. కానీ రెగ్యులర్‌గా సర్వీస్ చేయించకపోతే బైక్ కండీషన్ దెబ్బతింటుంది. సర్వీసింగ్ చేయించడం వల్ల బైక్ మైలేజ్ పెరుగుతుంది. ఇంజన్ సక్రమంగా పని చేస్తుంది. ఇంజన్ లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది.

కార్బ్యురేటర్ చెక్ చేసుకోండి

ప్రతీ బైక్ మైలేజ్ కార్బ్యేరేటర్ అనే పరికరం మీద ఆధారపడి ఉంటుంది. మీ బైక్ మైలేజ్ ఇవ్వకపోతే.. వెంటనే కార్బ్యురేటర్ చెక్ చేయించండి. ఒక వేళ కార్బ్యురేటర్‌లో ఏదైనా సమస్య ఉంటే బైక్ మైలేజ్ అస్సలు రాదు. బండి సర్వీసింగ్ చేయించిన ప్రతీసారి కార్బ్యురేటర్ పనితీరు చెక్ చేయించుకోవడం బెటర్.

మంచి ఇంజన్ ఆయిల్ వాడండి

బైక్ ఇంజన్ సరిగ్గా పనిచేయాలి అంటే ఇంజన్ ఆయిల్ తప్పనిసరి. అయితే ఇందులో మంచి కంపెనీ ఆయిల్ వాడటం బెటర్. తక్కువ ధరకు దొరుకుతుందని నాసిరకం ఇంజన్ ఆయిల్ వాడితే బైక్ పాడయిపోతుంది. కొద్ది రోజులకు ఇంజన్ పికప్ తగ్గుతుంది, మైలేజ్ కూడా రాదు. ఇందుకోసమే ఇంజన్‌కు ఏ ఆయిల్ వాడుతున్నామనేది చాలా ముఖ్యం. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి.

అదనపు పార్ట్స్ అమర్చవద్దు

బైక్ కొన్నప్పుడు వచ్చిన పార్ట్స్‌తో పాటు కొందరు ఎక్స్‌ట్రా పార్ట్స్ అమరుస్తుంటారు. ఇలా చేయడం ద్వారా బైక్ మైలేజ్ తగ్గే ప్రమాదం ఉంటుంది. చాలా మంది సైలెన్సర్ విషయంలో ఇలాంటి తప్పులు చేస్తారు. బైక్ బీటింగ్ కోసం సైలెన్సర్ మారుస్తుంటారు. డిస్క్ బ్రేక్‌లు కూడా అమరుస్తుంటారు. ఇలాంటివి చేయడం ద్వారా ఆటోమేటిక్‌గా బైక్ మైలేజీ తగ్గిపోతుంది.

టైర్ ప్రెజర్ సరిగ్గా ఉంచుకోవాలి

టైర్లలో ఎప్పుడూ నిండుగా గాలి ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా దూర ప్రయాణం చేసే సమయంలో గాలి సమృద్దిగా ఉందో లేదో చూసుకోవడం ముఖ్యం. పెట్రోల్ నింపుకున్న సమయంలోనే ఎయిర్ ప్రెజర్ చెక్ చేయించుకోవాలి. గాలి తక్కువగా ఉంటే బైక్ వెళ్లే స్పీడ్ తగ్గుతుంది. ఆటోమేటిక్‌గా మైలేజ్ కూడా తగ్గి పోతుంది. దీనికోసమే టైర్లలో గాలి సరైనంత ఉంచుకోవాలి.

ఎకో ఫ్రెండ్లీ స్పీడ్‌లో బైక్ నడపాలి

బైక్‌ను పరిమిత వేగంలో నడపాలి. అప్పుడే మైలేజ్ పెరుగుతుంది. చాలా మంది ర్యాష్ డ్రైవిగ్ చేస్తుంటారు. ఇలా చేస్తే ఇంజన్ హీట్ పెరుగుతుంది. పరిమితికి మించి వేడికి గురైనప్పుడు ఇంజన్, కార్బ్యురేటర్ మైలేజ్ ఇచ్చే సామర్థ్యం తగ్గిపోతుంది. 45 నుంచి 50 మధ్యలో స్పీడ్ మెయిన్‌టేన్ చేయడం మంచిది. ఈ స్పీడ్‌లో వెళ్తే మైలేజ్ బాగా రావడమే కాకుండా.. ఇంజన్ కూడా సురక్షితంగా ఉంటుంది.

సిగ్నల్స్ దగ్గర ఇంజన్ ఆఫ్ చేయండి

హైదరాబాద్ లాంటి సిటీస్‌లో ట్రాఫిక్ ఎక్కువ. కాబట్టి సిగ్నల్స్ దగ్గర చాలా సేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో ఇంజన్ ఆఫ్ చేయడం బెటర్. ఇంజన్ ఆన్‌లో ఉన్నంతసేపు పెట్రోల్ తీసుకుంటూనే ఉంటుంది. ఇలా సిగ్నల్ పడినప్పుడు ఇంజన్ ఆఫ్ చేస్తే పెట్రోల్ సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చే అన్ని బైక్‌లకు దాదాపుగా సెల్ఫ్ స్టార్ట్ ఉంటోంది. కాబట్టి సిగ్నల్ పడిన వెంటనే బైక్ స్టార్ట్ చేసుకోవడం పెద్ద మ్యాటర్ కాదు. ఇలా ఇంజన్ ఆఫ్ చేయడం ద్వారా ప్రతీ నెలా దాదాపు 10% పెట్రోల్ సేవ్ చేసుకోవచ్చు.

ఎండలో బైక్ పెట్టొద్దు

పెట్రోల్ అనేది చాలా సులువుగా ఆవిరి అయిపోతుంది. ఈ కారణంగా బైక్‌లు ఎండలో పెట్టడం మంచిది కాదు. ముఖ్యంగా ఎండాకాలంలో ఇంకా జాగ్రత్త పాటించాలి. ఉష్టోగ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బైక్‌లలో మంటలు చెలరేగిన ఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఎక్కువ సేపు ఎండలో బైక్ పెట్టడం వల్ల ఇంజన్ మీద ప్రభావం పడి మైలేజ్ తగ్గిపోయే ప్రమాదం ఉంది.

Next Story