Maravanthe beach: సహజ సౌందర్యం.. ఈ 'మరవంతే బీచ్' సొంతం
మరవంతే బీచ్ కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో మరవంతే అనే చిన్న పట్టణంలో ఉంది. సహజ అందం, ప్రశాంతమైన వాతావరణానికి ఈ బీచ్ ప్రసిద్ధి
By అంజి Published on 2 April 2023 11:30 AM GMTMaravanthe beach: సహజ సౌందర్యం.. ఈ 'మరవంతే బీచ్' సొంతం
మరవంతే బీచ్ కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో మరవంతే అనే చిన్న పట్టణంలో ఉంది. సహజ అందం, ప్రశాంతమైన వాతావరణానికి ఈ బీచ్ ప్రసిద్ధి చెందింది. ఒకవైపు అరేబియా సముద్రం, మరోవైపు సౌపర్ణికా నది కలయిక దీనిని టూరిస్ట్ హాట్‌స్పాట్‌గా మార్చింది. బీచ్ చుట్టూ ఉండే తాటి చెట్లు, కొబ్బరి తోటలు దాని సహజ అందాల్ని మరింత పెంచేస్తాయి. ఇంత సహజ అందం సొంతం చేసుకున్న ఈ మరవంతే బీచ్ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మరవంతే బీచ్ పర్యాటకులకు అనేక రకాల సాహస జల క్రీడలను అందిస్తుంది. బోటింగ్, జెట్ స్కీయింగ్, బనానా బోట్ రైడ్స్, పారాసైలింగ్, సర్ఫింగ్ టీ కొన్ని ప్రసిద్ధ జల క్రీడలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ బీచ్ అందమైన సూర్యోదయం, సూర్యస్తమయాన్ని ఆస్వాదించడానికి కరెక్ట్ ప్లేస్. ఇక్కడ ఏడాది పొడవునా అనేక పండగలు, ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా జనవరిలో జరిగే వార్షిక పండుగ మూడు రోజుల పాటు జరుగుతుంది. అప్పుడు పర్యాటకులు బీచ్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీతం, నృత్య ప్రదర్శనలను చూడవచ్చు.
ఇక్కడ పర్యాటకుల కోసం సౌకర్యవంతమైన, మంచి వసతిని అందించే అనేక బీచ్ సైడ్ రిస్టార్ట్‌లు, హోటళ్లు అందుబాటులో ఉన్నాయి. అంతేగాక పర్యాటకులు స్థానిక సంస్కృతి, జీవనశైలి అనుభవాన్ని అందించే హోమ్‌స్టేలు, గెస్ట్‌హౌస్‌లను కూడా ఎంచుకోవచ్చు. ఈ బీచ్‌కి దగ్గరలో ఉండే కొడచాద్రి కొండలు సాహస యాత్రకులు ట్రెక్కింగ్ చేయడానికి ఎంతో అనువుగా ఉంటుంది. అక్కడి కొండలు దట్టమైన అడవులతో కప్పబడి అనేక జాతుల పక్షులకు, జంతువులకు నిలయంగా ఉంది.
మరవంతేలో అత్యంత ప్రజాదరణ పొందిన వంటలలో ఒకటి ఫిష్ కర్రీ, క్రాబ్ మసాలా, రొయ్యల ఫ్రై,.. స్థానిక రుచులతో ఉండే ఈ వంటకాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. పర్యాటకులకు ఇక్కడి కొండలు, అరేబియా సముద్రం, చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలు ఇక్కడికి సందర్శకులను ఆహ్వానిస్తాయి. ఈ బీచ్ సందర్శించడానికి అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు ఉత్తమ సమయం. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా, సముద్రం ప్రశాంతంగా ఉంటుంది.