పెట్రోలియం జెల్లీ సాధారణంగా శీతాకాలంలో కాళ్లు, చేతులు పగలకుండా రాసుకుంటారు. కానీ దీంతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
పర్ఫ్యూమ్ ఎక్కువ సేపు ఉండేందుకు పెట్రోలియం జెల్లీ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పర్ఫ్యూమ్ రాసుకునే ముందు కొంచెం పెట్రోలియం జెల్లీని చర్మంపై రాసుకోవడం వల్ల పర్ఫ్యూమ్ ఎక్కువ సేపు ఉంటుంది.
చిట్లిన వెంట్రుకలను తరచుగా వాజిలిన్ రాసుకోవడం వల్ల వెంట్రుకలు తిరిగి ఆరోగ్యంగా మారడమే కాదు.. జుట్టు మృదువుగా, మెరిసేలా తయారవుతుంది.
మీ ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే మీకు పెట్రోలియం జెల్లీ బాగా ఉపయోగపడుతుంది. వాటి పాదాలకు రోజూ కాస్త పెట్రోలియం జెల్లీ రాస్తే అవి సురక్షితంగా ఉంటాయి.
మేకప్ తీయడానికి ఖరీదైన క్రీములకు బదులు పెట్రోలియం జెల్లీ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కాటన్ ప్యాడ్‌కు కొంచెం వాజిలిన్ పూసి దాంతో మేకప్ తీయడం చాలా ఈజీ.