రిఫ్రిజిరేటర్ నుంచి నీరు లీక్ కావడం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి. ఇలా నీరు లీక్ కావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. రిఫ్రిజిరేటర్‌లో అదనపు నీటి నిర్వహణకు డీఫ్రాస్ట్ డ్రెయిన్ ఉంటుంది. ఆహార కణాలు, ఇతర వ్యర్థాల వల్ల ఆ కాలువ మూసుకుపోతే రిఫ్రిజిరేటర్ నుంచి నీరు బయటికి వస్తుంది. రిఫ్రిజిరేటర్ కింద ఉండే డ్రెయిన్ ప్యాన్ ఆవిరైన నీటిని సేకరిస్తుంది.
ఈ ప్యాన్ దెబ్బతిన్నా నీటి లీకేజీ జరుగుతుంది. వాటర్ సప్లై లై్ డిస్‌కనెక్ట్ అయినా లీకేజీ జరుగుతుంది. రిఫ్రిజిరేటర్‌లో కూలింగ్ మేనేజ్మెంట్ కోసం తలుపు చుట్టూ రబ్బరు పట్టీ ఉంటుంది. అది దెబ్బతిన్నా నీటి లీకేజీ జరుగుతుంది.
ఏం చేయాలంటే?
లీకేజీని గుర్తిస్తే ముందుగా రిఫ్రిజిరేటర్‌ను అన్‌ప్లగ్ చేయండి. ఫ్రిజ్ వెనుక భాగంలో డీఫ్రాస్ట్ డ్రెయిన్‌ను చిన్న బ్రష్/ పైప్ క్లీనర్‌తో శుభ్రం చేయండి. వెచ్చని నీటితోనూ ఫ్లష్ చేయవచ్చు. డ్రెయిన్ పగుళ్లు/ దెబ్బతిన్నట్టయితే కొత్తది ఫిక్స్ చేయండి.