ఈ నగ్న పర్వతం.. ఎందుకంత డేంజర్.!

Interesting facts about nanga parbat mountain. చాలా మంది సాహసికులు ప్రపంచంలోని ఎత్తైన పర్వతాలన్నీ అధిరోహించాలని కలలు కంటూ ఉంటారు. అయితే ఈ ప్రయాణంలో కొన్ని

By అంజి  Published on  31 July 2022 8:50 AM GMT
ఈ నగ్న పర్వతం.. ఎందుకంత డేంజర్.!

చాలా మంది సాహసికులు ప్రపంచంలోని ఎత్తైన పర్వతాలన్నీ అధిరోహించాలని కలలు కంటూ ఉంటారు. అయితే ఈ ప్రయాణంలో కొన్ని పర్వతాలు ఎక్కుతుంటే ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది. మరికొన్ని పర్వతాలైతే భయాన్నీ క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే పర్వతం కూడా భయానికి మారుపేరుగా ఉంది. ఇంతకీ ఆ పర్వతం ఎక్కడ ఉంది. ఎందుకు ఆ పర్వతాన్ని చూసి భయపడుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరాల్లో తొమ్మిదవ శిఖరం 'నంగా పర్బత్'. అంటే నగ్న పర్వతం అని అర్థం. ఈ పర్వతం పాక్ ఆక్రమిత కాశ్మీరులోని గిల్గిట్ బాల్టిస్తాన్‌లో ఉంది. ఈ శిఖరం ఎత్తు 26,660 అడుగులు (8,130 మీటర్లు). ఈ పర్వతంపై జర్నీ భయపడుకుంటా చేయాల్సిందే. ఎందుకంటే.. ఈ పర్వతం నిటారుగా ఉంటుంది. దీన్ని ఎక్కడం చాలా కష్టం, అపాయకరం కూడా. 20వ శతాబ్దం మొదట్లో ఈ పర్వతాన్ని అధిరోహించే ప్రయత్నంలో అనేక మంది తమ ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి దీనికి 'కిల్లర్ మౌంటెన్' అనే పేరు వచ్చింది.

1953లో హెర్మన్ బుహ్ల్ అనే పర్వాతారోహకుడు ఫస్ట్‌టైమ్ ఈ పర్వతాన్ని అధిరోహించాడు. ఈ పర్వతంపైకి వెళ్లే మార్గం కూడా చాలా ఇరుకుగా, ప్రమాదకరంగా ఉంటుంది. కారకోరం హైవే దగ్గర నుంచి ఈ పర్వతాన్ని ఎక్కవచ్చు. ఈ కిల్లర్ మౌంటెన్ మార్గం గుండా 10 మైళ్లు ప్రయాణిస్తే ఒక అందమైన విలేజ్ వస్తుంది. ఇక్కడికి వెళ్లిన వారందరూ ఈ టూర్‌ను మోస్ట్ డేంజరెస్ అండ్ థ్రిల్లింగ్ టూర్ అంటుంటారు.

Next Story