స్వచ్ఛమైన నెయ్యిని ఇలా గుర్తించండి

పాల నుంచి వచ్చే ఉప ఉత్పత్తి నెయ్యి, పాలను పెరుగుగా మార్చి ఆ పెరుగును మజ్జిగగా చేసి, ఆ మజ్జిగను చిలకడం ద్వారా వెన్నను వేరు చేస్తారు.

By అంజి  Published on  6 Oct 2024 1:42 PM GMT
pure ghee, adulterated Ghee,

స్వచ్ఛమైన నెయ్యిని ఇలా గుర్తించండి

పాల నుంచి వచ్చే ఉప ఉత్పత్తి నెయ్యి, పాలను పెరుగుగా మార్చి ఆ పెరుగును మజ్జిగగా చేసి, ఆ మజ్జిగను చిలకడం ద్వారా వెన్నను వేరు చేస్తారు. ఆ వెన్నను వేడి చేసి నెయ్యిని తయారు చేస్తారు. మరికొందరు పాలపై వచ్చే మీగడను తీసి ఎక్కువ రోజుల పాటు సేకరించి దాన్ని వేడి చేసి నెయ్యిని తయారు చేస్తారు. తిరుమలలో లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న వార్తలతో.. తాము వాడే నెయ్యి కల్తీదా, స్వచ్ఛమైనదా అనే సందేహం చాలా మందిలో నెలకొంది. ఈ తరుణంలో స్వచ్ఛమైన నెయ్యిని ఎలా గుర్తించాలో చూద్దాం..

- గడ్డకట్టిన స్వచ్ఛమైన నెయ్యిని మన చేతిలో ఉంచితే కొన్ని సెకన్లలోనే గది ఉష్ణోగ్రత వద్ద, మన చేతి వేడికి కరిగిపోతుంది.

- గది ఉష్ణోగ్రత వద్ద ఒక గ్లాసులో నీళ్లు వేసి అందులో ఒక చుక్క నెయ్యిని వేయాలి. కొన్ని సెకన్ల తర్వాత ఆ నెయ్యి తేలితే స్వచ్ఛమైనదని అర్థం. అలా కాకుండా ఆ నెయ్యి చుక్క మునిగిపోతే అందులో కల్తీ పదార్థాలు కలిశాయని అర్థం.

- స్వచ్ఛమైన నెయ్యి ప్రత్యేకమైన వాసనను కలిగి ఉంటుంది. ఇది వేడి చేసినప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. కల్తీ నెయ్యిలో ఎలాంటి వాసన ఉండదు.

Next Story