ఆనందాన్ని అందరూ కోరుకుంటారు. ఎక్కడైతే సంతోషం ఉంటుందో.. అక్కడే దాన్ని వెతుక్కుంటారు. కానీ, నిజజీవితంలో అన్ని సందర్భాల్లోనూ ఆ సంతోషం మనకు దక్కదు. కానీ, రీల్స్ విషయంలో ఇది భిన్నం. AI పుణ్యమా అని మనకు నచ్చిన కంటెంట్ మనం అడగకుండానే మన దగ్గరికి రీల్స్ రూపంలో మళ్లీ మళ్లీ వస్తుంది. ఈ రీల్స్ చూసినప్పుడు మన మైండ్‌లో డోపమైన విడుదల అవుతుంది. దీంతో మెదడుకు కొత్త ఉత్సాహం లభిస్తుంది. ఇది రోజూ జరగడంతో మన మెదడు మళ్లీ అదే కోరుకుంటుంది. అలా తక్షణ సంతోషం మాత్రమే పొందేలా మన మెదడు అలవాటు చేసుకుంటుంది.
దీనివల్లే చదవడం, స్కిల్స్ పెంచుకోవడం వంటి దీర్ఘకాలంలో లాభాలను అందించే విషయాలపై దృష్టి పెట్టలేకపోతున్నామని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ఈ రీల్స్ మన మెదడును ఓ నిర్దిష్ట పద్ధతిలో అలవాటు చేస్తుంది. దీంతో నెమ్మదిగా వచ్చే ప్రతిఫలాలను తట్టుకోలేక, రోజువారీ జీవితం నిస్సారంగా, నిరుత్సాహంగా మారుతుంది. ఇది మద్యపానం కన్నా 5 రెట్లు ప్రమాదకరమని, దీని వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఆవేశాన్ని నియంత్రించుకునే సామర్థ్యం దెబ్బతింటుందని స్టడీలో తేలింది. కాబట్టి, వీలైనంత వకు రీల్స్ చూడటం మానుకోండి. లేదంటే మీ లక్ష్యాలను హరింపజేసే గుదిబండలా ఇది మారుతుంది.