'టీ' ని మళ్లీ మళ్లీ వేడి చేసి తాగుతున్నారా?.. అయితే ఇది మీ కోసమే

ఉదయం టీ తాగకపోతే చాలా మందికి రోజు ప్రారంభం కాదు అన్నట్టు ఫీలవుతారు. టీ తాగితే వెంటనే కాస్త ఉత్సాహంగా ఉన్నట్టు ఫీలవుతారు.

By అంజి  Published on  3 Feb 2025 10:40 AM IST
disadvantages, drinking, tea, heating

'టీ' ని మళ్లీ మళ్లీ వేడి చేసి తాగుతున్నారా?.. అయితే ఇది మీ కోసమే

ఉదయం టీ తాగకపోతే చాలా మందికి రోజు ప్రారంభం కాదు అన్నట్టు ఫీలవుతారు. టీ తాగితే వెంటనే కాస్త ఉత్సాహంగా ఉన్నట్టు ఫీలవుతారు. ఇళ్లలో టీ చేసుకునే వారు.. మళ్లీ పదే పదే చేసుకోవడం ఎందుకు అని ఒకే సారి తయారు చేసుకుని.. తాగాలనుకున్నప్పుడు మళ్లీ మళ్లీ వేడి చేసి తాగుతుంటారు. అయితే ఈ విధానం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీ ని మళ్లీ మళ్లీ వేడి చేయడం వల్ల ముందుగా ఛాయ్‌ రుచి మారుతుంది.

అలాగే సువాసన కోల్పోవడంతో పాటు దానిలో ఉండే పోషకాలు కూడా క్రమంగా మాయమౌవుతాయి. టీ ని పదే పదే వేడి చేసినా దానిలో హానికర బ్యాక్టీరియా పెరుగుతుందని ఇది ఆరోగ్యానికి హాని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే కడుపు నొప్పి, జీర్ణ సంబంధిత సమస్యలు, కడుపులో గ్యాస్‌ ఏర్పడటం వంటి సమస్యలు తలేత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే ఇంట్లో టీ ని అప్పటికప్పుడే చేసుకుని తాగితే రుచి, దాని ప్రయోజనాలు మనకు అందుతాయి.

Next Story