Best Tourist Spot: 'కోవలం' బీచ్‌ ప్రత్యేకతలు ఇవే.!

కోవలం.. కేరళ రాజధాని తిరువనంతపురంకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. మెల్ల మెల్లగా ఎగసిపడే అలలు.. వెచ్చని ఇసుక మీద తీరం వెంబడి

By అంజి  Published on  18 Jun 2023 1:17 PM IST
Best Tourist Spot: కోవలం బీచ్‌ ప్రత్యేకతలు ఇవే.!

కోవలం.. కేరళ రాజధాని తిరువనంతపురంకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. మెల్ల మెల్లగా ఎగసిపడే అలలు.. వెచ్చని ఇసుక మీద తీరం వెంబడి నడవడం.. ఇదో అందమైన అనుభూతి. తీరం మాటున దాగిన కొండల నడుమ కొబ్బరి చెట్లు సందర్శకులకు ఆహ్వానాన్ని పలుకుతున్నాయి. ఈ సముద్రపు కెరటాలను మనసారా పలకరించాలంటే కేరళలోని 'కోవలం బీచ్'లో అడుగులు వేయాల్సిందే. మీరూ హాలిడే ప్లాన్ చేస్తున్నట్టయితే కోవలం బీచ్ మంచి డెస్టినేషన్‌ స్పాట్

ఈ ప్రదేశం రోజు రోజుకూ పాపులర్‌ అవ్వడంతో చరిత్రికారులు దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ట్రావెన్‌ కోర్‌ పాలకురాలైన మహారాణి సేతు లక్ష్మీబాయికి ఈ ప్రదేశం చాలా బాగా నచ్చింది. దీంతో 1920లో ఆమె కోసం ఇక్కడ బీచ్ రిసార్ట్ కట్టించారు. భారత్‌లోని ఇంటర్నేషనల్‌ టూరిస్ట్‌లను ఆకర్షిస్తున్న.. బెస్ట్‌ బీచ్‌లలో ఇది ఒకటి. ఇక్కడికి యురోపియన్ దేశాల నుంచి టూరిస్టులు ఎక్కువగా వస్తుంటారు.

ఈ బీచ్‌కు కోవలం పేరెలా వచ్చిందంటే?

కోవలం అంటే 'కొబ్బరి చెట్లు తోపు' అని అర్థం. మామూలుగానే కేరళలోని కొబ్బరి చెట్లు ఎక్కువ. కోవలంకి ఆ పేరు పెట్టారంటే అక్కడెంత కొబ్బరి చెట్లు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒకపక్క స్వచ్ఛమైన అలల అందాలు మరో పక్క బీచ్ దగ్గర సూర్యోదయ, సూర్యస్తమయ సమయాల్లో కలిగే అనుభూతి.. మాటల్లో చెప్పలేనివి. అందుకే ఈ ప్రదేశాన్ని 'భూతల స్వర్గం' అంటారు. ఈ బీచ్‌ మూన్‌ షేపులో ఉంటుంది.

కోవలం బీచ్‌లో సన్‌ బాతింగ్‌, స్విమ్మింగ్‌, రెస్ట్‌కి తగిన ఏర్పాట్లు ఉన్నాయి. అలాగే మసాజ్‌ సర్వీస్, హెర్బల్ బాడీ టోనింగ్‌ కూడా ఉన్నాయి. ఉదయం 11 గంటల నుంచే బీచ్‌లో సందడి మొదలవుతుంది. ఇక్కడికి టూరిస్ట్‌లు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. బీచ్‌ దగ్గర హోటల్స్‌, బడ్జెట్‌ కాటేజీలు ఉన్నాయి. షాపింగ్‌ కోసం మాల్స్‌ కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. దక్షిణాది వంటకాలతో పాటు ఇంటర్నేషన్‌ ఫుడ్స్‌కు అందుబాటులో ఉన్నాయి.

కోవలం బీచ్‌కు తిరువనంతరపురంకు 15 కి.మీ దూరంలో ఉంది. తిరువనంతపురం పద్మనాభ స్వామి దేవాలయం, నేపియర్ మ్యూజియం ప్రముఖ పర్యాటక కేంద్రాలు కూడా చూడొచ్చు. కోవలం బీచ్‌లో వెదర్‌ సెప్టెంబరు మాసం నుంచి మార్చి వరకు బాగుంటుంది. ఈ బీచ్‌కు రైలులో వెళ్లాలనుకుంటే.. దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ తిరువనంతపురం సెంట్రల్. తిరువనంతపురం నుంచి బస్సులు బస్సులు, క్యాబ్‌లు అందుబాటులో ఉంటాయి.

Next Story