భోగి మంట దగ్గర కాసేపైనా ఉండాలంటారు.. ఎందుకో తెలుసా?
భోగభాగ్యాలు ఇచ్చే పర్వదినంగా భోగి పండుగను భావిస్తారు. భగ అంటే మంటలు. ఈ పదం నుంచే భోగి అనే పేరొచ్చింది.
By అంజి Published on 13 Jan 2025 7:37 AM ISTభోగి మంట దగ్గర కాసేపైనా ఉండాలంటారు.. ఎందుకో తెలుసా?
భోగభాగ్యాలు ఇచ్చే పర్వదినంగా భోగి పండుగను భావిస్తారు. భగ అంటే మంటలు. ఈ పదం నుంచే భోగి అనే పేరొచ్చింది. అయితే ధనుర్మాసంలో రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పూర్వం ఈ మంటల్లో పిడకలు కాల్చేవారు. రావి, మామిడి, మేడి వంటి ఔషధ చెట్ల బెరళ్లను ఆవు నెయ్యి వేసి కాల్చేవారు. ఈ మంటల నుంచి విడుదలయ్యే గాలిని పీల్చితే శరీరంలో 72 వేల నాడులు ఉత్తేజితం అవుతాయని విశ్వసించేశారు. అందుకే భోగి మంట దగ్గర కాసేపైనా ఉండాలనే సంప్రదాయం వచ్చింది. అన్ని చెడు కర్మలు తొలగిపోవాలని కూడా భోగి మంట వేస్తారు.
ఈ రోజు సాయంత్రం పూట చిన్న పిల్లలకు భోగిపల్లు పోసే ఆచారం అనాదిగా వస్తోంది. భక్షగి పళ్లు అంటే రేగు పళ్లు. వీటిని తలపై పోడయం వల్ల సూర్యుడి ఆశీర్వాదం ఉంటుందని నమ్ముతారు. అలాగే అక్కడుండే నరాలు యాక్టివ్ అవ్వడానికి ఇవి సహాయపడతాయని సైన్స్ చెబుతోంది. చలికాలంలో పిల్లలు జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్లు సోకి అనారోగ్యం బారిన పడుతుంటారు. వీటిని తింటే ఇందులోని సీ విటమిన్ పిల్లల శరీరంలోని రోగ నిరోధక శఖ్తిని పెంచుతుంది. ఈ పండ్లను గులాబీ, చామంతి, బంతి పూల రెక్కలు, చిల్లర నాణేలు, చెరకు గడ ముక్కలతో కలిపి పోస్తూ దీవిస్తారు. దీని వల్ల బాలారిష్ట, దిష్టి దోషాలు తొలగి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని భారతీయుల నమ్మకం.