గూస్‌బంప్స్ ఎలా వస్తాయి?
ఏదైనా ఊహించని సంఘటనలు ఎదురైనప్పుడు, ఆశ్చర్యానికి గురైనప్పుడు మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి.
By అంజి Published on 19 Aug 2024 6:15 AM GMTగూస్‌బంప్స్ ఎలా వస్తాయి?
ఏదైనా ఊహించని సంఘటనలు ఎదురైనప్పుడు, ఆశ్చర్యానికి గురైనప్పుడు మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి. దీన్నే గూస్‌బంప్స్ అని కూడా అంటారు. ఇంతకీ ఈ గూస్‌బంప్స్ ఎలా వస్తాయో మీకు తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా మన చర్మం మీద ఉంటే వెంట్రుకలను సపోర్ట్ చేసేందుకు 'ఎరక్టర్ పిలి' అనే ఓ కండరం ఉంటుంది. ఈ కండరం సంకోచించినప్పుడు అక్కడి చర్మం దగ్గరకు వచ్చి వెంట్రుకలు పైకి లేస్తాయి. అయితే బయట జరిగిన విషయాల వల్ల మనం షాక్‌కి గురైనప్పుడు మెదడు, శరీరాన్ని అప్రమత్తం చేయాలనుకుంటుంది.
ఈ క్రమంలోనే రక్తం వేగం కాస్త పెరిగి చర్మం కండరాలు బిగుసుకుపోతాయి. దీంతో రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఈ గూస్‌బంప్స్ కేవలం మనుషులకే కాదు, చాలా రకాల జీవులకు కూడా వస్తాయి. అయితే మనకు చలిగా అనిపించినప్పుడు కూడా ఒక్కోసారి గూస్‌బంప్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
భావోద్వేగానికి గురైనప్పుడు, సంతోషానికి గురైనప్పుడు కూడా గూస్ బంప్స్ వస్తాయి. పట్టలేని ఆనందం, దుఃఖం, భయం, ఉద్వేగం వంటి వాటికి గురైనప్పుడు ఇలా జరుగుతుందని నిపుణులు అంటున్నారు. దీనిని వైద్య పరిభాషలో.. జట్టు నిక్కబొడవడాన్ని పైలోరెక్షన్, క్యూటిస్ అన్సెరినా లేదా హారిపిలేషన్ అంటారు.