న్యూ ఇయర్‌ సెలెబ్రేషన్స్‌కి సూపర్‌ లోకేషన్స్‌ ఇవే!

మరో రెండు రోజుల్లో 2023 ఏడాదికి గుడ్‌బై చెప్తూ.. నూతన సంవత్సరానికి వెల్కమ్‌ చెప్పబోతున్నాం. ఈ క్రమంలోనే న్యూఇయర్‌కి బెస్ట్‌ స్పాట్‌లను మీ ముందుకు తీసుకువచ్చాం..

By అంజి  Published on  29 Dec 2023 1:15 PM IST
best locations, New Year celebrations, New Year 2024

న్యూ ఇయర్‌ సెలెబ్రేషన్స్‌కి సూపర్‌ లోకేషన్స్‌ ఇవే!

మరో రెండు రోజుల్లో 2023 ఏడాదికి గుడ్‌బై చెప్తూ.. నూతన సంవత్సరానికి వెల్కమ్‌ చెప్పబోతున్నాం.. ఇక న్యూఇయర్‌ సెలెబ్రేషన్స్‌ అనగానే అందరికీ ఎక్కడ జరుపుకోవాలి? ఎలా జరుపుకోవాలి? అని రకరకాల ఆలోచనలు వస్తాయి. అలాంటి వారి కోసమే న్యూ ఇయర్‌ వేడుకలకు అద్భుతంగా ఉండే ప్రాంతాలను మీ ముందుకు తీసుకువచ్చాం..

గుల్మార్గ్‌ : న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌కు గుల్మార్గ్‌ బెస్ట్‌ స్పాట్‌. న్యూఇయర్‌ రోజు మంచు దుప్పటి పరుచుకునే ప్రకృతి అందాల మధ్‌య బాణాసంచా రంగలను చూడటానికి రెండు కళ్లూ చాలవు

అండమాన్‌ నికోబార్‌ దీవులు : ప్రపంచంలోనే అందమైన బీచ్‌లు అండమాన్‌ నికోబార్‌లో ఉన్నాయి. ఆ బీచ్‌లలో నూతన సంవత్సర వేడుకలు అద్భుతంగా ఉంటాయి.

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో రాత్రుళ్లు ఉండే ఉల్లాసభరిత వాతావరణం, స్ట్రీట్‌ ఫుడ్‌ కల్చర్‌ ఎంతగానో ఆకట్టుకుంటాయి. న్యూ ఇయర్‌ సెలెబ్రేషన్స్‌కి ఇది కూడా బెస్ట్‌ స్పాటే.

పుదుచ్చేరి : పుదుచ్చేరిలో ఉండే బీచ్‌లు స్పెషల్‌ అట్రాక్షన్‌ అని చెప్పవచ్చు. నిత్యం బిజీగా గడిపిన పాత సంవత్సరానికి గుడ్‌బై చెప్పి.. నూతన ఏడాదికి వెల్కమ్‌ చెప్పవచ్చు.

గోకర్ణం : గోకర్ణం అందమైన బీచ్‌లకు కేరాఫ్‌ అడ్రస్. ప్రశాంతమైన వాతావరణంలో మీ ఆత్మీయులతో పాటు న్యూ ఇయర్‌ వెల్కమ్‌ చెప్పడానికి అనువైన ప్రదేశం

గోవా : న్యూఇయర్‌ సెలెబ్రెషన్స్‌ అంటే మొదట గుర్తొచ్చేది గోవానే. అక్కడి బీచ్‌లు, ఆ ఎంజాయ్‌మెంట్‌తో జరుపుకునే నూతన సంవత్సర వేడుకలకు గోవా టాప్‌ 1 అండ్‌ బెస్ట్‌ స్పాట్‌గా నిలిచింది.

Next Story