మీ బైక్‌కు ఇన్సూరెన్స్ తీసుకున్నారా?.. ఇది తెలుసుకోండి
విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు దాదాపు అందరికీ బైక్ అంటే ఓ ఎమోషన్. ఏళ్లపాటు ఓర్చి చివరకు వారికి కావాల్సిన బైక్‌ని ఓ రోజు సొంతం చేసుకుంటారు.
By అంజి Published on 4 March 2024 4:15 AM GMTమీ బైక్‌కు ఇన్సూరెన్స్ తీసుకున్నారా?.. ఇది తెలుసుకోండి
విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు దాదాపు అందరికీ బైక్ అంటే ఓ ఎమోషన్. ఏళ్లపాటు ఓర్చి చివరకు వారికి కావాల్సిన బైక్‌ని ఓ రోజు సొంతం చేసుకుంటారు. కొత్తది కొంటే దానితో పాటే ఏడాది కాలానికి ఇన్సూరెన్స్ వస్తుంది. మరి సెకండ్ హ్యాండ్ బైక్ కొంటే బీమా ఉందో లేదో ఓసారి పరిశీలించండి. భారతదేశంలో ప్రభుత్వం తప్పనిసరి చేసిన ఇన్సూరెన్స్ ఏదైనా ఉందంటే అది కేవలం వెహికల్ ఇన్సూరెన్స్ మాత్రమే. మరి అంత కష్టపడి కొన్న బైక్‌కి మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నారా..? అయితే మనలో చాలా మందికి దీని ప్రాముఖ్యత తెలియక పోలీసులు అడుగుతారని మాత్రమే తీసుకుంటారు.
రోడ్డు మీద వాహనం నడిపేటప్పుడు ప్రమాదం జరగవచ్చు. ఆ సమయంలో మన వాహనంతో పాటు ఎదుట వాహనానికి డ్యామేజ్ అవ్వొచ్చు. నడపుతున్న వ్యక్తికి ప్రమాదం జరగవచ్చు. ఈ ఖర్చులన్నింటీని కవర్ చేసేదే ఇన్సూరెన్స్. బీమా తీసుకోకపోతే మాత్రం జరిగిన ప్రమాదానికి మొత్తం కారణమైన వ్యక్తే భరించాల్సి ఉంటుంది. ఈ ఇన్సూరెన్స్‌లలో సమగ్రమైన, థర్డ్ పార్టీ అంటూ రెండు రకాలు ఉంటాయి.
సమగ్రమైన బీమా అంటే.. ఇందులో ముఖ్యంగా ప్రమాదం జరిగినప్పుడు ఇరు వాహనాలకు పూర్తి భరోసా ఉంటుంది. అలాగే ప్రమాదంలో గాయపడిన వారందరికీ పూర్తి వైద్య ఖర్చులు కవర్ అవుతాయి. అంతేకాకుండా ఫైర్ వల్ల ప్రమాదం జరిగినా.. ప్రకృతి విపత్తుల ద్వారా అంటే.. వరదలు, భూకంపాలు వంటివి సంభవించినా ఈ ఇన్సూరెన్స్ భరిస్తుంది. రెండింటీని పోల్చితే దీని ప్రీమియం ఖరీదైనది.
థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్
పేరులోనే అర్థమవుతుంది. ఇందులో బీమా తీసుకున్న వ్యక్తి ఎదుటి వారి వాహనానికి డ్యామేజ్ చేస్తే ఆ వాహనానికి ఖర్చులు భరించేది. దీంట్లో వ్యక్తిగత ప్రమాదానికి ఎలాంటి ఖర్చులను అందించదు. ఈ రెండు రకాల బీమాలను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా పొందవచ్చు. ఆన్‌లైన్‌లో అయితే వేరు వేరు కంపెనీల ప్రీమియంతో పాటు ఇతర వివరాలు తెలుసుకోవడానికి వీలు ఉంటుంది. అలాగే ఇన్సూర్డ్స్ డిక్లేర్డ్ వాల్యూ ఎక్కువ ఉన్నది చూడాలి.