ఈ విడాకుల గుడి గురించి మీకు తెలుసా?
సాధారణంగా మన దేశంలో అయినా.. విదేశాల్లో అయినా గుడికి వెళ్తే కోరికలు తీర్చమని, దాంపత్యం బాగుండాలని కోరుకుంటారు. కానీ ఓ గుడికి మాత్రం విడాకులు కావాలని కోరుకునేందుకు వెళ్తారు.
By అంజి Published on 26 May 2024 12:31 PM GMTఈ విడాకుల గుడి గురించి మీకు తెలుసా?
సాధారణంగా మన దేశంలో అయినా.. విదేశాల్లో అయినా గుడికి వెళ్తే కోరికలు తీర్చమని, దాంపత్యం బాగుండాలని కోరుకుంటారు. కానీ ఓ గుడికి మాత్రం విడాకులు కావాలని కోరుకునేందుకు వెళ్తారు. ప్రపంచంలోని ఓ దేశంలో ప్రత్యేకమైన విడాకుల ఆలయం ఉంది. ఇక్కడి వారి భర్తల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలు వస్తారు. ఇంతకీ ఆ గుడి ఎక్కడుందని తెలుసుకోవాలనుందా.. పూర్తి వివరాలు కింద ఉన్నాయి.
విడాకుల గుడి అని పేరున్న టోకీజీ ఆలయం జపాన్‌లో ఉంది. ప్రకృతి సోయగాల నడుమ ఉన్న ఈ ఆలయానికి దాదాపు 600 ఏళ్ల చరిత్ర ఉంది. ఇప్పటికీ ఆలయంలో 600 ఏళ్ల నాటి మహిళల కష్టాలను కళ్లకు కట్టినట్టు చూపే ఆనవాళ్లు ఉన్నాయి. 12, 13 శతాబ్దాల్లో జపనీస్ సమాజంలో విడాకులు తీసుకునే హక్కు మగవారికి మాత్రమే ఉండేదట. దీంతో 1285లో బౌద్ధ బిక్షువు కాకుసాన్ షిదో-నీ తన భర్త జ్ఞాపకార్థం ఒక ఆలయాన్ని నిర్మించింది.
ఆ గుడి విడాకులైన ఒంటరి మహిళలకు, విడాకులకు కోసం పోరాడే మహిళలకు ఆశ్రయంగా మారిందట. 1873లో జపాన్ మహిళలకు విడాకులు తీసుకునే హక్కు వచ్చిన తర్వాత ఈ ఆలయం విడాకుల ఆలయంగా మారిపోయింది. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు తమ విడాకుల కారణాలను ఒక పేపర్‌పై రాసి ఆలయంలోని టాయిలెట్‌లో ఫ్లష్ చేస్తే.. ఆ విడాకుల కోరిక త్వరగా నెరవేరుతుందని నమ్ముతారు.
ఈ ఆలయం జపాన్‌లోని కనగావా ప్రిఫెక్చర్‌లోని కమకురా నగరంలో ఉంది. ఈ చారిత్రక బౌద్ధ దేవాలయం మహిళలకు వారి హక్కులపై ఎటువంటి హక్కులు లేని కాలం నాటిది. ఆ సమయంలో జపాన్‌లో విడాకుల కోసం ఎటువంటి నిబంధన లేదు. గృహ హింసకు గురైన మహిళలు తమ భర్తలను విడిచిపెట్టినప్పుడు, ఈ ఆలయం వారికి ఆశ్రయం కల్పించేది. మహిళలు ఇక్కడ బస చేయడం ప్రారంభించిన తర్వాత, క్రమంగా ఈ ఆలయం కూడా సురక్షితమైన ప్రదేశంగా కనిపించడం ప్రారంభమైంది. మహిళలకు సురక్షితమైన సంస్థగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం నేటికీ చాలా ప్రసిద్ధి చెందింది.