నేడు టెడ్డీ డే.. మీ ప్రేమకు గుర్తుగా టెడ్డీ గిఫ్ట్ ఇవ్వొచ్చు
Happy Teddy Day 2023 heres how you can celebrate teddy day.నేడు టెడ్డీ డే.. టెడ్డీ డే గురించి తెలుసుకొని మన ప్రియమైన
By తోట వంశీ కుమార్ Published on 10 Feb 2023 9:44 AM ISTప్రేమ అంటే ఏమిటంటే ఎట్టాగ చెప్పమంటే అంటూ అదేదో సినిమాలో ఓ పాట ఉంటుంది. ప్రేమను మాటల్లో చెప్పలేం. అదో అందమైన అనుభూతి. ఎప్పుడు, ఎవ్వరి మధ్య ఎలా ఎందుకు పుడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఇక ప్రేమలో ఉన్నవారికి ప్రతి రోజు పండగే. అయినప్పటికీ ఫిబ్రవరి 14 వస్తుంది అంటే చాలు ఏదో తెలియని ఆత్రం. ఆ రోజున స్పెషల్‌గా జరుపుకోవాలని ప్రేమికులు బావిస్తుంటారు. వాలంటైన్స్‌కు వారం రోజుల ముందు నుంచే హడావుడి ప్రారంభం అవుతుంది.
అలా ప్రారంభమైన వీక్ లో మొదటి రోజు రోజ్ డే, రెండో రోజు ప్రపోజ్ డే, మూడో రోజు చాక్లెట్ డే, నాలుగో రోజు టెడ్డీ డే జరుపుకుంటారు. నేడు టెడ్డీ డే.. టెడ్డీ డే గురించి తెలుసుకొని మన ప్రియమైన వారికి టెడ్డీ డే శుభాకాంక్షలు చెపుదాం.
చాలా మందికి టెడ్డీలు అంటే ఇష్టం ఉంటుంది అనే సంగతి తెలిసిందే. ఇక ఎక్కువ మంది ప్రియురాలికి కోపం వస్తే బుజ్జగించడానికో లేదంటే ఆమె మనసులో చోటు సంపాదించడానికే చేసే ప్రయత్నాల్లో టెడ్డీ బియర్స్ లాంటివి ఇస్తుంటారు. ఆ టెడ్డీలు చూసినప్పుడు వారికి ఆ గిఫ్ట్ ఇచ్చిన వారిని గుర్తు చేస్తాయట. అందుకనే చాలా మంది టెడ్డీలను ఇస్తుంటారు.
టెడ్డీ గిఫ్ట్‌గా ఇచ్చి ప్రేమికులు చెప్పుకునే శుభాకాంక్షలు కొన్ని..
- నేను ఎక్కడున్నా, ఏం చేస్తున్నా..
నా మనసు నీతోనే ఉంటుంది.
నీ గురించే ఆలోచిస్తుంది.
ఈ టెడ్డీ నా ప్రేమను నీతో షేర్ చేసుకుంటుంది.
- జీవితమనే పడవ ప్రయాణంలో ఎందరు ప్రయాణికులున్నా..
నా జీవితాన్ని మాత్రం నీతో పంచుకుంటా..
అలాంటి అవకాశం నాకే కావాలని కోరుకుంటా..
హ్యాపీ టెడ్డీ డే
- కళ్ళకు నచ్చిన వారిని కన్నుమూసి తెరిచేలోగా మరిచిపోవచ్చు కానీ..
మనసుకు నచ్చిన వారిని మరణం వరకు మరువలేము...
హ్యాపీ టెడ్డీ డే