అత్యంత అరుదైన బ్లడ్ గ్రూపు ఎంటో తెలుసా?

బ్లడ్ గ్రూపులను సాధారణంగా ఇంగ్లిష్ అల్ఫాబెట్స్ ఎ,బి,ఓ లాంటి పేర్లతో ఉంటాయి. కానీ ఓ రెండు బ్లడ్ గ్రూప్‌లను మాత్రం

By అంజి  Published on  30 April 2023 8:00 AM GMT
Golden blood group,  rarest blood group, Bombay blood group

ప్రపంచంలో అత్యంత అరుదైన బ్లడ్ గ్రూపు ఎంటో తెలుసా?  

బ్లడ్ గ్రూపులను సాధారణంగా ఇంగ్లిష్ అల్ఫాబెట్స్ ఎ,బి,ఓ లాంటి పేర్లతో ఉంటాయి. కానీ ఓ రెండు బ్లడ్ గ్రూప్‌లను మాత్రం పేర్లతో పిలుస్తారు. అవే మనదేశంలోని బాంబేలో గుర్తించిన బాంబే బ్లడ్ గ్రూపు కాగా, మరోకటి ఆస్ట్రేలియాలో గుర్తించిన గోల్డెన్ బ్లడ్ గ్రూపు. ఇందులో బాంబే బ్లడ్ గ్రూప్ అనేది 10వేల మందిలో ఒక్కరికి మాత్రమే ఉంటుంది. అయితే గోల్డెన్ బ్లడ్ గ్రూపు కలిగిన వారు బాంబే బ్లడ్ గ్రూపు కంటే చాలా తక్కువగా ఉంటారు. అందుకే దీనికి గోల్డెన్ బ్లడ్ గ్రూప్ అని అంటారు.

గోల్డెన్ బ్లడ్ గ్రూపు ఎలా బయటపడింది?

ఈ బ్లడ్ గ్రూపును తొలిసారిగా 1961లో ఆస్ట్రేలియాకు చెందిన మహిళలో గుర్తించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలో 43 మందిలో మాత్రమే ఈ రక్తం ఉందని వెల్లడైంది.కాబట్టి ఈ రక్తం ప్రపంచంలో అత్యంత విలువైనది, ప్రమాదమైనది కూడా. ఈ రక్తం కలిగిన వారికి రక్తం అవసరమైనప్పుడు దాతలు దొరకడం అత్యంత కష్టమైన పని.

గోల్డెన్ బ్లడ్ గ్రూపు వారు రక్తదానం చెయోచ్చా?

ఈ బ్లడ్ గ్రూపు వారిని విశ్వదాతలు అంటారు. వీళ్లు ఎవరికైనా రక్తం ఇవ్వొచ్చు. ఎందుకంటే ఈ గ్రూపు రక్తంలోని ఎర్ర రక్త కణాల్లో Rh యాంటిజెన్ ఉండదు.దీంతో పాజిటివ్, నెగటివ్ బ్లడ్ గ్రూప్‌లతో సంబంధం లేకుండా అందరికి గోల్డెన్ బ్లడ్ గ్రూపు వారి రక్తాన్ని ఎక్కించవచ్చు.

గోల్డెన్ బ్లడ్ దొరికే అవకాశం ఉందా?

ఇప్పటివరకు ప్రపంచంలో 43 మందిలో మాత్రమే ఈ బ్లడ్ గ్రూపు గుర్తించబడింది. అతి తక్కువ మందిలో ఉండే ఈ బ్లడ్ గ్రూపు కలిగినవారు ఏ దేశంలో ఎంతమంది ఉన్నారో కనిపెట్టడం చాలా కష్టం. ఈ రక్తాన్ని నిల్వ చేసే కేంద్రాలు ఎక్కడైనా ఉన్నాయా అనేది కూడా ఎవరికీ పెద్దగా తెలియలేదు. అత్యంత అరుదైన ఈ రక్తంపై పరిశోధనలు జరిపేందుకు నమూనాల కోసం కొందరు పరిశోధకులు దాతల కోసం తీవ్రంగా వెతికారు. అయినా చాలామందికి నిరాశ తప్పలేదు.

Next Story