వినాయక చవితి వచ్చేస్తోంది. అందరూ ఈ పండుగ కోసం ఆసక్తి ఎదురుచూస్తూ ఉన్నారు. గణేష్ చతుర్థి రోజు మండపం డెకరేషన్ ఎంతో కీలకం. ఎవరి అభిరుచికి తగ్గట్టు వారు ఈ మండపాలను డెకరేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే కొన్ని డెకరేషన్ ఐడియాలు మీ కోసం..
పూలతో డెరేషన్ చేయాలనుకుంటే క్రియేటివిటీకి ఆకాశమే హద్దు. వివిధ రంగు రంగుల పూలను తీసుకువచ్చి, పూజగదిని అలాగే ఇంటిని చక్కగా అలంకరించుకోవచ్చు. ఇందులో సింగిల్ కలర్, లేదా మిక్స్డ్ కలర్స్ ఇలా మీ అభిరుచిని బట్టి డెకరేట్ చేసుకోవచ్చు.
థర్మకోల్‌తో కూడా సులువుగా డెకరేట్ చేసుకోవచ్చు. మండపం వంటి స్ట్రక్చర్‌ను తయారుచేసుకోవచ్చు.
ఎకో ఫ్రెండ్లీ డెకరేషన్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నట్టయితే లైవ్ ప్లాంట్స్ అలాగే ఆకులతో గణపతిని ముచ్చటగా డెకరేట్ చేయవచ్చు. వీటితో పాటు పండ్లను కూడా పెడితే మండపం లుక్ బాగుంటుంది.
అలాగే పండుగను ఎకో ఫ్రెండ్లీగా జరుపుకోవాలి అనుకుంటే.. మట్టి, పిండి, కాగితంతో చేసిన విగ్రహాలను వాడటం మంచిది.