ఫ్రిజ్‌లో నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా?
ఎండాకాలం వచ్చేసింది. ఎండలో అలా బయటకు వెళ్లి వచ్చామంటే చాలు.. చాలా మంది నేరుగా ఫ్రిజ్ దగ్గరకు వెళ్లి చల్లని నీరు తాగుతారు.
By అంజి Published on 12 March 2024 1:30 PM ISTఫ్రిజ్‌లో నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా?
ఎండాకాలం వచ్చేసింది. ఎండలో అలా బయటకు వెళ్లి వచ్చామంటే చాలు.. చాలా మంది నేరుగా ఫ్రిజ్ దగ్గరకు వెళ్లి చల్లని నీరు తాగుతారు. ఇంట్లో ఉన్నా సరే.. ఫ్రిజ్ వాటరే తాగుతారు. అయితే ఫ్రిజ్‌లో ఉండే చల్లటి నీటిని ఎక్కువ కాలం పాటు తీసుకుంటే పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు..
ఆహారం తింటూ, తిన్న వెంటనే ఫ్రిజ్‌లో ఉండే చల్లటి నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. ఆహారం సరిగా జీర్ణం కాదు. ఇది రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపుతుంది. ఫ్రిజ్ వాటర్ ఎక్కువగా తాగితే మలబద్ధకం, గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఫ్రిజ్ వాటర్ ఎక్కువగా తాగితే అవి గుండెలోని వాగస్ నరాలపై ప్రభావం చూపిస్తాయట. దీనివల్ల గుండె పనితీరు నెమ్మదించి.. హృదయ స్పందన రేటు తగ్గి గుండెపోటు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందట. అందుకే గుండె సమస్యలతో బాధపడేవారు ఫ్రిజ్ వాటర్‌కు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తుంటారు.
చల్లటి నీరు తాగితే పంటి చిగుళ్ల నొప్పి వస్తుంది. మరీ ఎక్కువగా తాగితే దంతాలు వదులుగా మారే అవకాశం ఉంది. ఫ్రిజ్‌లోని నీటిని తాగడం వల్ల కొందరికి జలుబు చేసే అవకాశం ఉంటుంది. మరి కొందరిలో శ్వాసకోశ సమస్యలు ఎదురు అవుతాయి. గొంతు ఇన్‌ఫెక్షన్స్ వచ్చే ముప్పు ఉంది. బరువు తగ్గాలని అనుకునేవారు ఫ్రిజ్ వాటర్‌ను తక్కువగాతీసుకోవాలి. వీటికి బదులు గోరువెచ్చని నీరు తాగడం మంచిది.