చేతిలో తాళాల గుత్తి పెడితే ఫిట్స్ తగ్గుతుందా?
మూర్చ (ఫిట్స్) మెదడు నరాలకు సంబంధించిన వ్యాధి. ఇది చాలా మందిని వేధిస్తోంది.
By అంజి
చేతిలో తాళాల గుత్తి పెడితే ఫిట్స్ తగ్గుతుందా?
మూర్చ (ఫిట్స్) మెదడు నరాలకు సంబంధించిన వ్యాధి. ఇది చాలా మందిని వేధిస్తోంది. ఇది ఒకసారి వస్తే.. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే దీర్ఘకాలిక రుగ్మతగా మారే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మనలో చాలా మంది మూర్చ వచ్చిన వ్యక్తికి వెంటనే ఇనుప తాళాలు లేదా ఇనుముతో కూడిన వస్తువులను చేతిలో పెట్టడం, ఇనుప వస్తువులను మెడలో వేయడం వంటివి చేస్తుంటారు.
దీని వల్ల ఫిట్స్ తగ్గుతుందనేది మన భావన. అయితే ఫిట్స్‌కి, ఇనుప తాళం చెవికి ఎలాంటి సంబంధం లేదని.. ఇది అపోహ మాత్రమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అసలు ఫిట్స్ వచ్చేటప్పుడు వ్యక్తుల చేతిని బలవంతంగా తెరవడం, అందులో ఏదైనా పెట్టి మూయడం వల్ల ఆ చేతిలో ఉండే నరాలు గాయపడే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే ఐరన్.. మెదడులోని అలజడిని కంట్రోల్ చేసి ఫిట్స్‌ని తగ్గిస్తుందని నమ్ముతారు.
నిజానికి ఇనుము నుంచి మన శరీరంలో ఉండే నరాలకు ఎలాంటి తరంగాలూ ప్రసరించవట. సాధారణంగా ఫిట్స్ లేదా మూర్ఛ ఎపిసోడ్ల రూపంలో వస్తుంది. ఇవి 1 నుంచి 2 నిమిషాలాఉ కంటే ఎక్కువ సేపు ఉండవట. ఈ సమయంలో మనం ఏం చేసినా, చేయకపోయినా దానంతట అవే ఆగిపోతాయట. ఒక వేళ ఇది 5 నిమిషాల కంటే ఎక్కువసేపు ఫిట్స్ ఉంటే వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.