ఆర్టీసీ బస్సు సీటులో కర్చీప్‌ వేసినంత మాత్రాన ఆ సీటు మనదవుతుందా?

తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే.

By అంజి
Published on : 8 Sept 2025 12:00 PM IST

scarf, RTC bus, RTC bus seat, Free bus travel scheme

ఆర్టీసీ బస్సు సీటులో కర్చీప్‌ వేసినంత మాత్రాన ఆ సీటు మనదవుతుందా?

తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే.. ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి బస్సుల్లో సీట్ల కోసం జరుగుతున్న గొడవల వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఓ మహిళ తాను కర్చీప్‌ వేసిన సీట్లో వేరొకరు కూర్చున్నారని పెద్ద రచ్చే చేసింది. మరి, బస్సులో కర్చీప్‌ వేసినంత మాత్రాన ఆ సీటు మనదవుతుందా? దీన్ని ఓ రిజర్వేషన్‌ ప్రాసెస్‌లాగా భావించవచ్చా? ఇప్పుడు తెలుసుకుందాం..

ఆర్టీసీ బస్సులో ప్రయాణీ రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందుకే బస్టాప్‌లోకి బస్సు రాగానే సీటు కోసం కొందరు కిటికీల నుంచి లోపలికి కర్చీప్‌లు వేస్తుంటారు. ఇది ఓ రకంగా ఈ సీటును నేను రిజర్వ్‌ చేసుకున్నాను అనే ఆలోచన ధోరణిని ప్రదర్శిస్తుంది. అయితే ఇది, తప్పా? రైటా? అని చెప్పడానికి ఎలాంటి రూల్స్‌ లేవు. ఇదంతా మనంతట మనం క్రియేట్‌ చేసుకున్నదే. సాధారణంగా బస్సులో సీటు కోసం ఉపయోగించే సాధారణ పద్ధతి ఫస్ట్‌ కమ్‌, ఫస్ట్‌ సర్వ్‌.. అంటే మొదట వచ్చిన వారికి మొదట ప్రాధాన్యత అని చెప్పవచ్చు.

ఆ తర్వాత వచ్చే వ్యక్తులు ఖాళీగా ఉన్న సీట్లను మాత్రమే తీసుకోవాలి. వృద్ధులు, మహిళలు, గర్భిణీ స్త్రీలు, వికలాంగుల కోసం కేటాయించిన సీట్లు వదిలి ఎవరు ఎక్కైనా కూర్చోవచ్చు. ఒక వేళ సీటుపై కర్చీఫ్‌ వేస్తే.. ఆ సీటు అతనికే సొంతం అని కూడా చెప్పడానికి లేదు. దాన్ని తీసేసి వేరే వ్యక్తి అక్కడ కుర్చున్నా ఎలాంటి తప్పు లేదు. కానీ, ఆ తర్వాత జరిగే పర్యావసనాలకు ఇద్దరూ బాధ్యత వహించాల్సి ఉంటుంది. నైతికత దృష్ట్యా చూస్తే.. కర్చీఫ్‌తో రిజర్వ్‌ చేసుకోవడం అనేది సరికాదు.

Next Story