రియల్‌ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నారా?.. ఇది తెలుసుకోండి

పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి రియల్‌ ఎస్టేట్‌ మంచి ఆప్షన్‌. దీర్ఘకాల పెట్టుబడులకు రియల్‌ ఎస్టేట్‌ అనువుగా ఉంటుంది.

By అంజి
Published on : 26 July 2025 10:42 AM IST

invest, real estate, REITs

రియల్‌ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నారా?.. ఇది తెలుసుకోండి

పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి రియల్‌ ఎస్టేట్‌ మంచి ఆప్షన్‌. దీర్ఘకాల పెట్టుబడులకు రియల్‌ ఎస్టేట్‌ అనువుగా ఉంటుంది. అయితే రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌ చేసుకోవాలి. అదేలాగో ఇప్పుడు చూద్దాం..

రియల్‌ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు వివిధ ప్రాంతాల్లో ఆస్తులు కొనాలి. దీని వల్ల ఒక ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ ధరలు తగ్గినా, మరో ఏరియాలో ధరలు బాగుండే అవకాశం ఉంటుంది. వాణిజ్య, నివాస, పారిశ్రామిక ప్రాపర్టీల్లో పెట్టుబడులు పెట్టాలి. దీని వల్ల రిస్క్‌ తగ్గుతుంది. మంచి లాభాలు వచ్చే అవకాశం పెరుగుతుంది. నివాస యోగ్యమైన ఆస్తులపై సంవత్సరానికి 3 నుంచి 4 శాతం వరకు అద్దె లభిస్తుంది.

వాణిజ్య ఆస్తులపై సంవత్సరానికి 7 నుంచి 8 శాతం వరకు రెంట్స్‌ రూపంలో ఆదాయం వస్తుంది. పెద్ద మొత్తంలో డబ్బులు లేని వాళ్లు 'రీట్స్‌' (REITs)లో పెట్టుబడులు పెట్టవచ్చు. ఇన్వెస్టర్లు తమ స్టాక్‌ బ్రోకర్ల ద్వారా రీట్‌ యూనిట్లను కొనుగోలు చేయవచ్చు. వాటికి విక్రయించవచ్చు. కొన్ని మ్యూచువల్‌ ఫండ్లు కూడా రీట్స్‌లో పెట్టుబడులు పెడతాయి. వాటిని కూడా మనం కొనుగోలు చేయవచ్చు.

Next Story