ఆరోగ్య బీమా... టాపప్‌ చేయిస్తున్నారా?

పెరుగుతున్న జీతాలతో పాటే.. వైద్య ఖర్చులు సైతం పెరుగుగుతున్నాయి. వీటిని తట్టుకోవాలంటే.. ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం తప్పనిసరిగా మారింది.

By అంజి  Published on  4 July 2024 5:45 PM IST
Top Up Policy, health insurance, Medical expenses

ఆరోగ్య బీమా... టాపప్‌ చేయిస్తున్నారా?

పెరుగుతున్న జీతాలతో పాటే.. వైద్య ఖర్చులు సైతం పెరుగుగుతున్నాయి. వీటిని తట్టుకోవాలంటే.. ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం తప్పనిసరిగా మారింది. ఈ బీమా పాలసీలో కూడా అధికంగా ఉన్న ప్రీమియం రేట్లు కలవరపెడుతున్నాయి. అధిక మొత్తంలో పాలసీ తీసుకోవడం కంటే.. ప్రాథమిక పాలసీని తీసుకొని, దీనికి టాపప్‌ చేయించడం వల్ల కొంత భారాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది. మరి, ఈ టాపప్‌ ఎంచుకునేటప్పుడు ఏయే అంశాలను చూడాలో వివరంగా తెలుసుకుందాం..

- టాపప్‌ పాలసీని ఎంచుకునే ముందు.. మీ దగ్గర ఉన్న ప్రాథమిక పాలసీ ఎంత? దాని నిబంధనలు ఏంటి? తెలుసుకుని కనీసం రూ.5 లక్షల మేరకు ఉండేలా తీసుకోవాలి.

- టాపప్‌ పాలసీలో కూడా నగదు రహిత చికిత్స ఉంటుంది. కానీ, కొన్ని టాపప్‌ పాలసీలు నగదు రహిత చికిత్సకు అనుమతి ఇవ్వకపోవచ్చు. బిల్లు చెల్లించిన తర్వాత తిరిగి పొందేందుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. చెక్‌ చేసుకోండి.

- క్లెయిమ్‌ పరిష్కారం ఎలా ఉంటుందో ముందే తెలుసుకోండి. కంపెనీ సేవా కేంద్రం పని తీరు, క్లెయిమ్‌ల నిర్వహణ ప్రక్రియను అంచనా వేయండి.

- టాపప్‌ పాలసీలకు చెల్లించిన ప్రీమియానికి కూడా ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 80 డీ కింద పన్ను మినహాయింపు లభిస్తుందని తెలుసుకోండి.

Next Story